Missed Accident: వామ్మో అదృష్టం బావుంది.. రెండు విమానాలు ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చాయి.. కానీ, ప్రమాదం జరగలేదు!
రెండు విమానాలు అత్యంత దగ్గరగా వచ్చి ప్రమాదానికి గురికాకుండా తప్పించుకుంటే.. అంతకు మించిన అదృష్టం ఏదీ ఉండదు కదూ. సరిగ్గా అటువంటి అదృష్టకర ఘటన సిడ్నీ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది.
Missed Accident: రెండు విమానాలు అత్యంత దగ్గరగా వచ్చి ప్రమాదానికి గురికాకుండా తప్పించుకుంటే.. అంతకు మించిన అదృష్టం ఏదీ ఉండదు కదూ. సరిగ్గా అటువంటి అదృష్టకర ఘటన సిడ్నీ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది.
సిడ్నీ ఎయిర్ పోర్ట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వచ్చే విమానాలు వస్తూనే ఉంటాయి.. వెళ్ళేవి వెళ్తూనే ఉంటాయి. మొత్తం 24 గంటలూ అక్కడ ఎప్పుడూ రద్దీనే. అక్కడ రెండు విమానాలు ఒకదానికి ఒకటి అత్యంత దగ్గరగా వచ్చిన సంఘటన గత ఫిబ్రవరి 9వ తేదీన చోటు చేసుకుంది.
ఒక సింగపూర్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం సిడ్నీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తృటిలో ప్రమాదం తప్పిపోయింది. ఆ సమయంలో వేగంగా గాలులు వీస్తున్నాయి.
ఈ ఘటనపై విచారణ జరిపిన ఆస్ట్రేలియన్ ట్రాన్స్ పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ఎటీఎస్బీ) ఆ ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడు వెల్లడించింది. దాని ప్రకారం..
ఎయిర్ బస్ ఏ380 జెట్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎడమ వైపుకు తిరగాల్సిన విమానాన్ని కుడి వైపు తిరగాల్సిందిగా సూచించారు. దీంతో పైలట్ విమానాన్ని కుడివైపుకు తిప్పారు.
సరిగ్గా అదేసమయంలో విమానాల మధ్య ఖాళీ ఉంచడం కోసం డాష్ 8 అనే ఎయిర్ క్రాఫ్ట్ ను కుడివైపుగా వెళ్ళమని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది విమానాన్ని కుడివైపుకు తీసుకుని గాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ ప్రయత్నంలో అప్పుడే ల్యాండ్ అవడానికి ప్రయత్నిస్తున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన మరో ప్రయాణీకుల విమానం బోయింగ్ 737 కు దగ్గరగా డాష్ 8 ఎయిర్ క్రాఫ్ట్ చేరుకుంది. ఈ రెండు విమానాల మధ్య దూరం నిలువుగా 4.8 కిలోమీటర్లకు.. సమాంతరంగా 397 మీటర్లకు తగ్గిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన తనం రెండు విమానాలకూ.
నాట్స్ లెక్కల ప్రకారం ఏదైనా రెండు విమానాల మధ్య ఉండాల్సిన కనీస దూరం నిలువుగా 3 నుంచి 5 మైళ్ళు.. సమాంతరంగా 1000 అడుగులు ఉండాలి. కానీ ఈ రెండు విమానాల మధ్య దూరం దానికంటే చాలా తక్కువగా అయిపొయింది. అయితే, అదృష్టవశాత్తూ అంత దగ్గరగా వచ్చినా రెండు విమానాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఎటీఎస్బీ అధికారులు ఆ సమయంలో ఏ 380 విమాన సిబ్బంది విపరీతమైన ఒత్తిడికి గురి అయివుంటారని చెబుతున్నారు. అంతే ఆ సమయంలో ఉన్న గాలుల పరిస్థితి వల్ల వారు మరింత కష్టపడి ఉంటారని అన్నారు.
మొత్తమ్మీద అతి దగ్గరగా వచ్చిన విమానాలు రెండూ ఏ ప్రమాదం బారిన పడకుండా సురక్షితంగా ఉండటం అద్భుతమైన విషయంగానే అధికారులు చెబుతున్నారు.
Also read: Twin Sisters: క్రేజీ కవలలు.. గర్భం దాల్చేందుకు వారికి ఒకే బాయ్ ఫ్రెండ్ కావాలట.. కానీ..