అడ్డదారిలో పోయాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏటీఎం చోరీకి యత్నించి పోలీసులకు చిక్కాడు

చదువుకోవల్సిన వయసులో బాల్యం పెడదారిపడుతోంది. వ్యసనాలకు బానిసలుగా మారుతూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మైనర్ బాలుడు ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కాడు.

అడ్డదారిలో పోయాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏటీఎం చోరీకి యత్నించి పోలీసులకు చిక్కాడు
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 27, 2020 | 4:52 PM

చదువుకోవల్సిన వయసులో బాల్యం పెడదారిపడుతోంది. వ్యసనాలకు బానిసలుగా మారుతూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మైనర్ బాలుడు ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. ఏటీఎంలో నగదును చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఆ బాలుడిని నాలుగు గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళ్‌హాట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆసి‌ఫ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడు(17) వ్యసనాలకు బానిసఅయ్యాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని ఫ్లాన్ చేసుకున్నాడు. ఇందుకు ఏటీఎంలను ఎంచుకుని చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే క్రమంలో శనివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆగాపురాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బుల తీసేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నించిన నగదు రాకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళ్‌హాట్‌ మార్కెట్‌లో నిందితుడు తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకొని జ్యూవెనల్‌ హోంకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.