ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను ప్రకటించిన ఐసీసీ..అన్ని ఫార్మెట్లకు సారథులుగా టీమిండియా ఆటగాళ్లు

ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ తాజాగా వన్డే, టీ20, టెస్టు దశాబ్దపు ఉత్తమ జట్లను ప్రకటించింది. ఇందులో మూడు ఫార్మెట్లను ఐసీసీ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇందులో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్​గా...

ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను ప్రకటించిన ఐసీసీ..అన్ని ఫార్మెట్లకు సారథులుగా టీమిండియా ఆటగాళ్లు
Follow us

|

Updated on: Dec 27, 2020 | 4:59 PM

Decade For all Formats : ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ తాజాగా వన్డే, టీ20, టెస్టు దశాబ్దపు ఉత్తమ జట్లను ప్రకటించింది. ఇందులో మూడు ఫార్మెట్లను ఐసీసీ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇందులో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్​గా టీమ్ఇండియా సారథి మహేంద్ర సింగ్ దోనీ ఎంపికయ్యాడు. కోహ్లీని టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎంపిక చేసింది. పురుషుల జట్లలో మూడు ఫార్మాట్​లకు టీమిండియా ఆటగాళ్లే కెప్టెన్లు​గా ఉండటం విశేషం.

దశాబ్దపు ఉత్తమ వన్డే జట్టు…

ఇందులో భారత్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ స్థానం పొందారు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. మిగిలిన వారిలో వార్నర్, మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), డివిలియర్స్, ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), షకిబుల్ హసన్ (బంగ్లాదేశ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), బౌల్ట్ (న్యూజిలాండ్), లసిత్ మలింగ (శ్రీలంక) ఉన్నారు.

దశాబ్దపు ఉత్తమ టీ20 జట్టు..

ఈ జట్టులో భారత్ నుంచి అత్యధికంగా నలుగురికి చోటు దక్కింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథిగా ఎంపికకాగా రోహిత్ శర్మ, వికాట్ కోహ్లీ, బుమ్రా మిగిలిన ముగ్గురు. ఇతర ఆటగాళ్లలో క్రిస్ గేల్, పొలార్డ్ (వెస్టిండీస్), ఫించ్, మ్యాక్స్​వెల్ (ఆస్ట్రేలియా), రషీద్ ఖాన్ (అఫ్గనిస్థాన్), లసిత్ మలింగ (శ్రీలంక) ఉన్నారు.

ఐసీసీ దశాబ్దపు ఉత్తమ టెస్టు జట్టు..

ఈ జట్టులో భారత్ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. విరాట్ కోహ్లీని సారథిగా ఎంపిక చేయగా అశ్విన్ మరో ఆటగాడు. మిగిలిన వారిలో వార్నర్, స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కుక్, స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్), విలియమ్సన్ (న్యూజిలాండ్), సంగక్కర (శ్రీలంక) ఉన్నారు.

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా