AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హరిద్వార్ కుంభమేళాపై ఉత్తారాఖండ్ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. మూడున్నర నెలలకు బదులుగా 48 రోజులకు కుదింపు

ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. అటు పండుగలు, ఉత్సవాలను మొక్కుబడిగా జరుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న హరిద్వార్ కుంభమేళాను మూడున్నర నెలలకు బదులుగా 48 రోజుల పాటు కుదిస్తూ ఉత్తారాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హరిద్వార్ కుంభమేళాపై ఉత్తారాఖండ్ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. మూడున్నర నెలలకు బదులుగా 48 రోజులకు కుదింపు
Balaraju Goud
|

Updated on: Dec 27, 2020 | 4:32 PM

Share

ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. అటు పండుగలు, ఉత్సవాలను మొక్కుబడిగా జరుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న హరిద్వార్ కుంభమేళాను మూడున్నర నెలలకు బదులుగా 48 రోజుల పాటు కుదిస్తూ ఉత్తారాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్ కౌశిక్ వెల్లడించారు. కుంభమేళాకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జనవరి 1వ తేదీకి బదులు ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే, కుంభమేళాకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్న మంత్రి.. ప్రధాన ఘాట్‌లలో మార్చి-ఏప్రిల్‌లో పవిత్ర స్నానాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ ఘాట్‌లలో 48 రోజుల పాటు భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించవచ్చునని తెలిపారు.

మరోవైపు, కుంభమేళాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి సన్నాహకాలు చేయలేదని అఖిల భారతీయ అఖారా పరిషత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కుంభమేళాకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నిధులను మంజూరు చేశారు. భక్తులకు భద్రత కల్పించడంలో భాగంగా నిఘా వ్యవస్థ కోసం రూ.17.34 కోట్లకు ఆమోదం తెలిపారు. తొలి విడతగా రూ.6.94 కోట్లు విడుదల చేశారు. అలాగే,1,000 పడకలతో తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు వీలుగా సామగ్రి కొనుగోలుకు రూ.15.46 కోట్లు మంజూరు చేశారు. ఏళ్ల తరబడి కుంభమేళాను మూడున్నర నెలల పాటు నిర్వహిస్తున్నప్పటికీ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈసారి నెలన్నర రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు మంత్రి మదన్ కౌశిక్ తెలిపారు.

కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!