Andhra Pradesh: “జగన్ ముద్దు – చంద్రబాబు వద్దు” నినాదంతో ముందుకెళ్లాలి.. ప్రజలకు మంత్రుల పిలుపు

|

May 29, 2022 | 7:57 PM

బీసీలను చంద్రబాబు(Chandrababu) ఓటు బ్యాంకుగానే చూశారని, ఒంగోలులో నిర్వహించిన మహానాడు అట్టర్ ప్లా్ఫ్ అయిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ లీడర్లకే సంక్షేమ పథకాలు...

Andhra Pradesh: జగన్ ముద్దు - చంద్రబాబు వద్దు నినాదంతో ముందుకెళ్లాలి.. ప్రజలకు మంత్రుల పిలుపు
Bus Yatra
Follow us on

బీసీలను చంద్రబాబు(Chandrababu) ఓటు బ్యాంకుగానే చూశారని, ఒంగోలులో నిర్వహించిన మహానాడు అట్టర్ ప్లా్ఫ్ అయిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ లీడర్లకే సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. కానీ వైఎస్.జగన్(YS.Jagan) పాలనలో కుల, మత, పార్టీలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి పలాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. జగనన్న ముద్దు.. చంద్రబాబు వద్దు అన్న నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర అనంతపురం(Anantapur) చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. కేబినెట్‌లో 74 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు మంత్రులుగా అవకాశం లభించిందని ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. టీడీపీది మహానాడు కాదు.. వెన్నుపోటు నాడు, దగా నాడు. టీడీపీది జరిపింది నయవంచక మహానాడు అని మంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. నవరత్నాలతో సీఎం జగన్‌ పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారని తెలిపారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సీఎం జగన్‌ పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ పాలనలోనే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి