కేసారంలో కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపక చిహ్నం: మంత్రి జగదీష్ రెడ్డి

|

Jun 18, 2020 | 2:40 PM

కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారాన్ని మారుస్తామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలికి సంతోష్ బాబు పేరు పెడుతామన్నారు.

కేసారంలో కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపక చిహ్నం: మంత్రి జగదీష్ రెడ్డి
Follow us on

కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని అశ్రునయనాలతో.. సైనిక అధికార లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. కేసారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అంత్యక్రియల్లో పలువురు రాజకీయ ప్రముఖులు కల్నల్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారాన్ని మారుస్తామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలికి సంతోష్ బాబు పేరు పెడుతామన్నారు. కర్నల్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు జగదీష్ రెడ్డి. వారి పిల్లల చదువులు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం బాసటగా ఉంటుందని పేర్కొన్నారు.