AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాచకుడి జోలెలో లక్షలు.. ఖంగు తిన్న ఖాకీలు..!

ఆయన ఓ యాచకుడని అంతా అనుకున్నారు. కానీ ఆయన మరణంచిన తర్వాత తెలిసింది.. ఆయన ఓ లక్షాధికారి అని. ముంబైలో జరిగిన ఈ ఘటన పోలీసులకు షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బిర్భిచంద్‌ అజాద్‌ (62) అనే వృద్ధుడు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే శుక్రవారం రాత్రి.. ఓ ట్రైన్ పట్టాలు దాటుతుండగా.. ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టి చనిపోయాడు. గమనించిన స్థానిక రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతని వద్ద ఉన్న […]

యాచకుడి జోలెలో లక్షలు.. ఖంగు తిన్న ఖాకీలు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 07, 2019 | 5:51 PM

Share

ఆయన ఓ యాచకుడని అంతా అనుకున్నారు. కానీ ఆయన మరణంచిన తర్వాత తెలిసింది.. ఆయన ఓ లక్షాధికారి అని. ముంబైలో జరిగిన ఈ ఘటన పోలీసులకు షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బిర్భిచంద్‌ అజాద్‌ (62) అనే వృద్ధుడు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే శుక్రవారం రాత్రి.. ఓ ట్రైన్ పట్టాలు దాటుతుండగా.. ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టి చనిపోయాడు. గమనించిన స్థానిక రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతని వద్ద ఉన్న సంచిని చూసి షాక్ తిన్నారు. అందులో పెద్ద ఎత్తున చిల్లరతో పాటుగా నగదు, బ్యాంక్ రిసిప్టలు ఉన్నాయి. సంచిలో ఉన్న మొత్తం చిల్లరను లెక్కించడానికి దాదాపు ఎనిమిది గంటలు పట్టినట్లు పోలీసులు తెలిపారు. చిల్లర, నోట్లు కలిసి మొత్తం రూ.1.77 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన రిసీప్ట్‌లను చూసి ఆశ్చర్యపోయారు. వేర్వేరు బ్యాంకుల్లో ఫిక్స్‌ చేసిన డిపాజిట్‌ మొత్తం రూ.8.77లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ఆ యాచకుడికి సంబంధించిన పాన్‌ కార్డు, ఆధార్‌కార్డు, సీనియర్‌ సిటిజన్‌ కార్డు కూడా ఉండడం మరో విశేషం. గుర్తింపు కార్డుల ద్వారా మృతుని స్వస్థలం రాజస్థాన్‌ రాష్ట్రం కాగా, ఏళ్ల క్రితం ముంబై వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు మృతుడు ఆజాద్ కుటుంబ సభ్యుల కోసం సంప్రదిస్తున్నట్లు తెలిపారు.

Follow Us
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే