దాయాది దేశంలో పాడిన భారతీయుడిపై వేటు !

దాయాది దేశంలో పాడిన భారతీయుడిపై వేటు !

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు నేపథ్యంలో దాయాది దేశాలైన ఇండియా – పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పాక్‌ ప్రభుత్వం మన సినిమాలని వారి దేశంలో ఆడకుండా నిషేదించింది. ఈ నేపథ్యంలోనే ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పాక్‌ నటీనటులను భారత్‌ సినిమాలలో నటించకుండా చూడాలని కూడా ప్రదానిని కోరింది. పాకిస్తాన్‌ ప్రభుత్వం భారత సినిమాలని నిషేదించిన క్రమంలో మనం కూడా పాక్‌కి సంబంధించిన […]

Pardhasaradhi Peri

|

Aug 14, 2019 | 12:48 PM

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు నేపథ్యంలో దాయాది దేశాలైన ఇండియా – పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పాక్‌ ప్రభుత్వం మన సినిమాలని వారి దేశంలో ఆడకుండా నిషేదించింది. ఈ నేపథ్యంలోనే ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పాక్‌ నటీనటులను భారత్‌ సినిమాలలో నటించకుండా చూడాలని కూడా ప్రదానిని కోరింది. పాకిస్తాన్‌ ప్రభుత్వం భారత సినిమాలని నిషేదించిన క్రమంలో మనం కూడా పాక్‌కి సంబంధించిన ఆర్టిస్టులు, సంగీత కళాకారులు, దౌత్యవేత్తల మీద భారత్‌ రాకుండా నిషేదం విధించాలని డిమాండ్‌ చేస్తూ ఒక లేఖ రాసింది. ఇదిలా ఉంటే మన దేశానికి చెందిన ఒక గాయకుడు మాత్రం పాకిస్తాన్‌ వెళ్లి అక్కడ ప్రదర్శన నిర్వహించాడు. అతడేవరో కాదు..ప్రముఖ గాయకుడు మీకాసింగ్‌..మీకాసింగ్‌ చేసిన పనికి గానూ ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.

కరాచీ నగరంలో పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముష్రాఫ్‌ సమీప బంధువు వివాహ వేడుకలో మీకాసింగ్‌ ప్రదర్శన నిర్వహించారు. ప్రొడక్షన్‌ హౌజలు, మ్యూజిక్‌ కంపెనీలు, ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ కంటెంట్‌ ప్రొవైడర్లు మీకాసింగ్‌తో కలిసి పనిచేయడాన్ని ఏఐసీడబ్ల్యూఏ నిషేదించింది. ఎవరైనా ఈ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సమయంలో మికాసింగ్‌ చేసిన పనితో నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu