AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020 MI vs KXIP : వాటే మ్యాచ్…డబుల్ సూపర్ ఓవర్

ఇది కదా క్రీడా అభిమానులకు కావాల్సి కిక్. సండే ఫుల్ మజా వచ్చేసింది. లీగ్‌ చరిత్రలో డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌‌ జరిగింది.

IPL 2020 MI vs KXIP : వాటే మ్యాచ్...డబుల్ సూపర్ ఓవర్
Ram Naramaneni
|

Updated on: Oct 19, 2020 | 12:46 AM

Share

ఇది కదా క్రీడా అభిమానులకు కావాల్సి కిక్. సండే ఫుల్ మజా వచ్చేసింది. లీగ్‌ చరిత్రలో డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌‌ జరిగింది. దుబాయ్‌ వేదికగా పంజాబ్‌, ముంబై జట్లు ఒకే స్కోర్ చేయడంతో  మ్యాచ్‌ టై అయ్యింది. దీంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. సూపర్‌ ఓవర్ కూడా టైగా మారింది. దీంతో మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. దీనిలో పంజాబ్‌ అద్బుత ప్రదర్శన చేసి లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.

మొదటి సూపర్ సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 5 పరుగులు  చేసింది.  కేఎల్ రాహుల్ నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు బుమ్రా. అనంతరం షమి జాగ్రత్తగా బౌలింగ్‌ చేయడంతో ముంబై సరిగ్గా అయిదు పరుగులే చేసింది. ఆఖరి బంతికి డికాక్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. దీంతో మరో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఫస్ట్  బ్యాటింగ్‌కు దిగిన ముంబై వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్ తరుపున బరిలోకి దిగిన గేల్‌, మయాంక్‌ టార్గెట్ మరో రెండు బంతులుండగానే ఫినిష్ చేసి..జట్టుకు సూపర్ విజయాన్ని అందించారు.

అంతకుమందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. డికాక్‌ (53; 43 బంతుల్లో, 3×4, 3×6), పొలార్డ్‌ (34*; 12 బంతుల్లో, 1×4, 4×4), కౌల్టర్‌నైల్‌ (24*, 12 బంతుల్లో, 4×4) మంచి ప్రదర్శన  చేశారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేసింది.  కేఎల్‌ రాహుల్ (77; 51 బంతుల్లో, 7×4, 3×6) అదరరగొట్టాడు. ( Bigg Boss Telugu 4: బిగ్ బాస్‌పై భారీ ట్రోలింగ్ ! )

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్