Breaking News
  • హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష . హాజరైన నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ . 10రోజుల పాటు ఎమ్మెల్యేలంతా వరద ప్రభావిత ప్రాంతాల్లోని పర్యటించి. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి-మంత్రి కేటీఆర్‌. నష్టపోయిన ప్రతీ ఒక్కరికి తక్షణం ప్రభుత్వం సాయాన్ని అందించాలి . ముంపుకు గురై కష్టాల్లో ఉన్న ఫ్యామిలీకి భరోసా కల్పించాలి. జీహెచ్‌ఎంసీ చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలి . సీఎం ఇచ్చిన పిలుపు మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేలంతా. రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేందుకు నిర్ణయం.
  • మళ్లీ వర్షం: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం . మీర్‌పేటలో కుండపోత వాన . భయంతో వణికిపోతున్న మీర్‌పేట వాసులు.
  • చెన్నై: మురళీధరన్‌ బయోపిక్‌ నుంచి తమిళనటుడు విజయ్‌ సేతుపతి. అయినా సోషల్‌ మీడియా వేదికగా ఆగని బెదిరింపులు. విజయ్‌ కుమార్తెపై దాడి చేస్తామంటూ ట్రోల్‌ చేస్తున్న ఆకతాయిలు . తీవ్రంగా ఖండించిన డీఎంకే ఎంపీ కనిమొళి . స్ట్రీలపట్ల, చిన్న పిల్లలపై సోషల్‌ మీడియాలో.. ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. కారణమైన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి .
  • తాడేపల్లి: పలు కీలక అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష . భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం సమీక్ష . జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ . స్కూళ్లు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులపై చర్చ . గ్రామ సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ నిర్మాణంపై సమీక్ష . రేపు ప్రారంభించనున్న వైఎస్సార్‌ బీమాతో పాటు పలు పథకాలపై చర్చ . ఉచిత విద్యుత్‌, రైతు అకౌంట్‌లో నగదు అంశంపై చర్చ .
  • టీవీ9తో ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ నారాయణరెడ్డి . హైదరాబాద్‌: తహశీల్దార్‌ నాగరాజుది ఆత్మహత్యలాగానే అనిపిస్తోంది . పిరికివాళ్లు ఎప్పుడూ సూసైడ్‌ చేసుకోరు . ధైర్యవంతులే సూసైడ్‌ చేసుకుంటారు. జైల్లో ఇంటరాగేషన్‌ జరగదు కాబట్టి మానసిక ఒత్తిడితోనే.. నాగరాజు సూసైడ్‌ చేసుకునే అవకాశం ఉంది . జైల్లోకానీ, బయటగానీ ఉ.3-4 గంటల మధ్యే సూసైడ్‌ చేసుకుంటారు . నాగరాజుది పార్షల్‌ హ్యాంగింగ్‌గానే అనే అనిపిస్తోంది . సింథటిక్‌ కాటన్‌ బట్టతో ఉరేసుకుంటే ఎలాంటి మరకలు కన్పించవు . తాడుతో ఉరేసుకుంటే మరకలు కన్పిస్తాయి-నారాయణరెడ్డి . 7 ఫీట్లున్న కిటికీ గ్రిల్‌కి టవల్‌తో ఉరేసుకుంటే ఎలాంటి శబ్ధం రాదు. నాగారాజు సూసైడ్‌ చేసుకునే సమయంలో.. కాళ్లు నేలకు ఆనుకుని ఉండడం వల్లే ఎలాంటి గాయాలు కాలేదు . 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలోనే నాగరాజు చనిపోయి ఉంటాడు . ఆ సమయంలో మిగతా ఖైదీలు గాఢనిద్రలో ఉండడంవల్లే గుర్తించలేదు. - టీవీ9తో ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ నారాయణరెడ్డి .
  • విశాఖ: నడువూరు చైన్‌ స్నాచింగ్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు . సీసీ కెమెరాల్లో లభించని నిందితుడి ఆచూకీ . పాన్‌షాపులో ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి చైన్‌ను ఎత్తుకెళ్లిన దుండగుడు . టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో నిందితుడిని ట్రాక్‌చేసే పనిలో పోలీసులు . ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితురాలు .

Bigg Boss Telugu 4: బిగ్ బాస్‌పై భారీ ట్రోలింగ్ !

తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోని పరిణామాలపై సోషల్ మీడియాలో  తీవ్రమైన ట్రోలింగ్  జరుగుతుంది. వీక్షకుల అభిప్రాయాలకు భిన్నంగా హౌస్‌  నిర్వాహకులు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Big boss 4 troll telugu, Bigg Boss Telugu 4: బిగ్ బాస్‌పై భారీ ట్రోలింగ్  !

తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోని పరిణామాలపై సోషల్ మీడియాలో  తీవ్రమైన ట్రోలింగ్  జరుగుతుంది. వీక్షకుల అభిప్రాయాలకు భిన్నంగా హౌస్‌  నిర్వాహకులు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి మూడు సీజన్స్‌తో పోలిస్తే ఈ సారి సీజన్‌పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు అంత స్టైయిట్‌ అండ్ ఫెయిర్‌గా ఆడిన దేవీ నాగవల్లీ ఎలా ఎలిమినేట్ అయ్యారో వీక్షకులతో పాటు ఆమెకు కూడా బిగ్ క్వచ్చన్. దీనిపై సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఇక ఇప్పుడు కుమార్  సాయిని ఏకంగా హౌస్‌ నుంచి గెంటేసినట్టే నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వారం నామినేషన్‌లో ఉన్న వ్యక్తులపై పలు వెబ్‌సైట్లు ఓటింగ్ నిర్వహించాయి. అందులో మోనల్, నోయల్ ప్రమాదంలో ఉన్నట్లు అన్నీ సర్వేలు తెలిపాయి. కానీ అనూహ్యంగా కుమార్ సాయిని ఎలిమినేట్ చేసేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో వీక్షకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అసలు సేఫ్ గేమ్ ఆడేది హౌస్‌లోని సభ్యుల కాదు..బిగ్ బాస్ నిర్వాహకులే అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో  కుమార్ సాయిని టార్గెట్ చేస్తారని ముందుగానే గ్రహించిన వీక్షకులు, అతడికి భారీగా ఓట్లు వేశారు. అంత చేసినా కూడా అతడిని ఎలిమినేట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. ఇక మోనల్‌ని గ్లామర్ కోసం,  ట్రయాంగిల్ లవ్ స్టోరీ కోసం బిగ్ బాస్ కావాలనే కాపుడుతున్నాడన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్..  ఇటీవల మెహబూబ్‌ని సోహైల్ చేత సేవ్ చేసిన విధానంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షోపై నమ్మకం పోతుంది బాస్…తస్మాత్ జాగ్రత్త.

( Bigg Boss Telugu 4 : అనుకున్నదే జరిగింది, కుమార్ సాయిని పంపించేశారు ! )

Related Tags