AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్‌ టెలీకాస్ట్‌ టీమ్‌ సభ్యుడికి కరోనా..!

ఇప్పటికే ఐపీఎల్ లో ఆడే పలువురు క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్ట్‌ టీమ్‌ మెంబర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కొంత గందరగోళం నెలకొంది.

ఐపీఎల్‌ టెలీకాస్ట్‌ టీమ్‌ సభ్యుడికి కరోనా..!
Balaraju Goud
|

Updated on: Aug 31, 2020 | 5:21 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్నా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మన దేశంలో కాకుండా యూఏఈలో నిర్వహిస్తోంది. అయితే, కరోనా వైరస్ అటు ఆటగాళ్లల్లో టీమ్ సభ్యుల్లో కొంత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ లో ఆడే పలువురు క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్ట్‌ టీమ్‌ మెంబర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కొంత గందరగోళం నెలకొంది.

ఐపీఎల్ 13వ సీజన్‌ సకాలంలో మొదలవుతుందానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం భారత్‌ నుంచి యూఏఈ బయలుదేరాల్సిన స్టార్‌ ప్రొడక్షన్‌ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ యూఏఈ ప్రయాణాలను రద్దు చేసుకున్నది. యూఏఈ వెళ్లడానికి సిద్ధమైన మొదటి బ్యా‌చ్‌లో స్టార్‌ ఉద్యోగికి వైరస్‌ సోకినట్లు వెల్లడైంది. దీంతో మిగతా ప్రొడక్షన్‌ టీమ్‌ సభ్యులందరి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు వెలువడిన తర్వాతనే యూఏఈకి సిబ్బందిని పంపించాలని స్టార్‌ స్పోర్ట్స్‌ సంస్థ భావిస్తున్నది.సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ ప్రారంభంకావాల్సి ఉండగా ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Follow Us
అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
బిజీ లైఫ్‌లో భాగస్వామితో గడిపే టైమ్‌ లేకుండా పోయిందా? ఈ అలవాట్లతో
బిజీ లైఫ్‌లో భాగస్వామితో గడిపే టైమ్‌ లేకుండా పోయిందా? ఈ అలవాట్లతో
కోహ్లీ లాంటి ఫిట్‌నెస్ కోసం.. పిల్లలకు ఇవి పెట్టండి!
కోహ్లీ లాంటి ఫిట్‌నెస్ కోసం.. పిల్లలకు ఇవి పెట్టండి!
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
33 సిక్సర్లు, 44 ఫోర్లు.. 493 పరుగులతో ఎంపీ కొడుకు ఊచకోత
33 సిక్సర్లు, 44 ఫోర్లు.. 493 పరుగులతో ఎంపీ కొడుకు ఊచకోత
ప్రోటోకాల్ పంచాయితీ.. గృహలక్ష్మి లక్కీ డ్రా నుంచి దానం వాకౌట్!
ప్రోటోకాల్ పంచాయితీ.. గృహలక్ష్మి లక్కీ డ్రా నుంచి దానం వాకౌట్!
డీసీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే
డీసీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే
పైసా ఖర్చు లేకుండా పార్లర్‌ వంటి గ్లో..ఈ ఫేషియల్‌తో ముఖంలో మెరుపు
పైసా ఖర్చు లేకుండా పార్లర్‌ వంటి గ్లో..ఈ ఫేషియల్‌తో ముఖంలో మెరుపు
రైతన్నా.. క్యాప్సికమ్ సాగుతో ఖతర్నాక్ ఆదాయం.. ఈ టిప్స్ పాటిస్తే..
రైతన్నా.. క్యాప్సికమ్ సాగుతో ఖతర్నాక్ ఆదాయం.. ఈ టిప్స్ పాటిస్తే..
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ వచ్చేసింది..
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ వచ్చేసింది..