గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్‌లాండ్.. “సైరా”.. మెగాస్టార్ అదుర్స్..

గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్‌లాండ్.. సైరా.. మెగాస్టార్ అదుర్స్..

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. భారీ హిస్టారికల్ చిత్రం సైరా నరసింహారెడ్డి ట్రైలర్ వచ్చేసింది. పెద్ద పెద్ద నగరాల్లోని అన్ని థియేటర్లలో సైరా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్‌ను చూసి మెగా అభిమానులు థియేటర్లలో ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ మొత్తం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 18, 2019 | 9:43 PM

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. భారీ హిస్టారికల్ చిత్రం సైరా నరసింహారెడ్డి ట్రైలర్ వచ్చేసింది. పెద్ద పెద్ద నగరాల్లోని అన్ని థియేటర్లలో సైరా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్‌ను చూసి మెగా అభిమానులు థియేటర్లలో ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ మొత్తం ఐదు భాషల్లో అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ స్టేడియంలో భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే వేడుకలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 22 కు వాయిదా పడటంతో ట్రైలర్‌ను ముందే విడుదల చేశారు.

అలాగే సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, కిచ్చాసుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక, జగపతిబాబు, రవికిషన్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను కూడా ఈ యాక్షన్ టీజర్‌లో విడుదల చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించారు.

ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. కేవలం విడుదలయిన గంట వ్యవధిలో ఏకంగా 2 మిలియన్ వ్యూస్ సాధించింది సైరా ట్రైలర్. ఇది చాలు ఈ సినిమా సృష్టించబోయే సంచలనాలు ఎలా వుంటాయో అంచనా వేసుకోవడానికి. ఇక ఈ ట్రైలర్‌ని సెలబ్రిటీలు కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీంతో సైరా కేవలం ఈ ఒక్క రికార్డ్‌తో సరిపెట్టుకోదు అనిపిస్తుంది. ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ సైరా ముందు తలవంచుతాయో. ఓవరాల్‌గా చెప్పాలంటే సైరా ట్రైలర్ రాక్స్. భారత మాతకీ జై అంటూ స్టార్ట్ అయిన ట్రైలర్ పూర్తి అయ్యే వరకు కనులు తిప్పలేము అంత అద్భుతంగా ఉంది. ట్రైలర్‌లో చిరంజీవి లుక్ చూసిన వారందరూ.. ఫిదా అయిపోయారని తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కేవలం స్వాతంత్య్ర సమర యోధుడు మాత్రమేకాదు, ఒక యోగి కూడా.

పైగా కీలకపాత్రలకు ప్రతిభ ఉన్న నటీనటులు తోడవ్వడంతో ‘సైరా’ ట్రైలర్ తోనే సూపర్ కిక్ ఇచ్చింది. సినిమాకి శాంపిల్ లాంటి ట్రైలర్‌కి అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు వస్తోంది. సినిమాలోని దేశభక్తి అంశం అందరికి బాగా కనెక్ట్ అయిపోయింది. దానికి విజువల్ గ్రాండియర్ కూడా తోడు కావడంతో అంతా రిపీట్ మోడ్‌లో ఈ ట్రైలర్‌ని చూస్తున్నారు. యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ దుమ్మురేపుతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu