మెగాస్టార్, హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో మూవీ..?

Megastar 153 Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాన్స్‌లు దక్కాలంటే కేవలం అదృష్టం ఉంటేనే సాధ్యమవుతుందని మరోసారి ప్రూవ్ అయింది. కొందరు దర్శకులు ఎన్నో హిట్ చిత్రాలు చేసినా కూడా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఇదే కోవలోకి దర్శకుడు హరీష్ శంకర్ కూడా చేరతారు. ఆయన ‘డీజే’ సినిమా తీసి.. సుమారు రెండేళ్లు గ్యాప్ తర్వాతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ‘గద్దలకొండ గణేష్’ను తెరకెక్కించి కమర్షియల్ హిట్ సాధించారు. మరోవైపు హరీష్ […]

మెగాస్టార్, హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో మూవీ..?
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 31, 2020 | 11:31 AM

Megastar 153 Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాన్స్‌లు దక్కాలంటే కేవలం అదృష్టం ఉంటేనే సాధ్యమవుతుందని మరోసారి ప్రూవ్ అయింది. కొందరు దర్శకులు ఎన్నో హిట్ చిత్రాలు చేసినా కూడా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఇదే కోవలోకి దర్శకుడు హరీష్ శంకర్ కూడా చేరతారు. ఆయన ‘డీజే’ సినిమా తీసి.. సుమారు రెండేళ్లు గ్యాప్ తర్వాతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ‘గద్దలకొండ గణేష్’ను తెరకెక్కించి కమర్షియల్ హిట్ సాధించారు.

మరోవైపు హరీష్ శంకర్ కెరీర్‌‌ను ఒకసారి పరిశీలిస్తే.. షాక్, మిరపకాయ్, రామయ్యా వస్తావయ్యా సినిమాలు మినహాయిస్తే.. మిగిలిన అన్ని చిత్రాలూ కూడా మెగా హీరోలతోనే చేశారు. ఇక ఇప్పుడు మరోసారి మెగా కాంపౌండ్‌లోనే తన కొత్త చిత్రాన్ని చేయనున్నట్లు ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఈ మధ్య హరీష్ శంకర్ చర్చలు జరిపినట్లు టాక్. మంచి కథతో వస్తే అవకాశం ఇస్తానని చిరు మాటిచ్చినట్లు తెలుస్తోంది. దీనితో  దర్శకుడు మెగా స్టోరీని సిద్ధం చేసే పనిలో పడ్డారట. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ లాంటి హిట్ చిత్రం తెరకెక్కించిన హరీష్ శంకర్ అన్నయ్య చిరంజీవికు ఎలాంటి కథను సిద్ధం చేస్తారో వేచి చూడాలి.