Marigold Flower: బంతి పూల నూనెతో ‘స్పా’ వంటి నిగారింపు.. ఇక ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి..

నూనె వడకట్టిన తర్వాత మిగిలిన పిప్పిని మాయిశ్చరైజింగ్ స్క్రబ్‌గా వాడచ్చు. అలా నాలుగు వారాల తర్వాత నూనెను వడగట్టి వాడుకోవాలి.

Marigold Flower: బంతి పూల నూనెతో ‘స్పా’ వంటి నిగారింపు.. ఇక ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి..
Marigold Flower F
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 02, 2023 | 11:21 AM

బంతిపూలతో నూనె తయారు చేస్తారని మీకు తెలుసా..? బంతిపువ్వు నూనె ఒక సుగంధ నూనె. బంతి పూల నూనెలో ఔషధ గుణాలు అనేకం ఉన్నాయి. బంతి పూలలలో ముద్ద బంతి, రేకు బంతి అంటు,దాదాపు 50 రకాలు వివిధరంగుల్లో సైజుల్లో లభిస్తాయి. బంతి పూలకు క్రిమి కీటకాలు దూరంగా ఉంటాయి. అలంకారం కోసం, ఆరోగ్య రీత్యా వీటిని ప్రతి సందర్భంలో వినియోగిస్తూనే ఉంటారు. బంతి నూనెను సుగంధం తైలంగా తక్కువ శాతం మంది ఉపయోగిస్తారు. ఎక్కువ మంది ఔషధంగా ముఖ్యంగా అంటు రోగాలు సంక్రమించకుండా, వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వాడతారు. ఇక బంతి పూలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బంతి పూల రంగుకు వాటిలో ఉండే కెరోటినాయిడ్స్ అనే రసాయనమే కారణం. ఇది యాంటీ ఆక్సిడెంట్స్‌లు పని చేసి శరీరంలోని రోగ నిరోధక శక్తికె కాకుండా క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు తలెత్తకుండా కాపాడుతుంది. ముఖ్యంగా భారతీయ వైద్యాల్లో బంతి పూల నూనెకు గొప్ప ప్రాధాన్యం ఉంది. బంతి పూలతో తయారు చేసిన నూనె చర్మానికి కూడా ఎంతో మేలుచేస్తుంది. చర్మానికి స్పా వంటి నిగారింపు, కాంతిని ఇస్తుంది. ఈ నూనె చర్మానికి కాంతిని అందజేస్తుంది. చర్మ సమస్యలకు దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇకపోతే, బంతి పూలతో నూనె ఎలా తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

ఇందుకోసం ఎండిన బంతిపూలని శుభ్రమైన జార్‌లో సగం వరకు నింపాలి. అందులో శుద్ధి చేయని సన్‌ఫ్లవర్ నూనె, ఆలివ్ నూనె, జొజోబా నూనె.. శుద్ధమైన కొబ్బరి నూనెలలో ఏదైనా ఒక నూనెను తీసుకుని ఎండిన పూలలో పోయాలి. ఒక అంగుళం ఖాళీ ఉంచి గాజు జార్‌లో నింపాలి. మూత గట్టిగా బిగించి జార్‌ని బాగా షేక్ చేయాలి. ఆ తర్వాత ఈ గ్లాస్ జార్‌ను నాలుగు వారాల పాటు చీకటి ప్రాంతంలో ఉంచి ప్రతి రెండు రోజులకు ఒకసారి బాగా కలపాలి. అలా నాలుగు వారాల తర్వాత నూనెను వడగట్టి వాడుకోవాలి.

ఇవి కూడా చదవండి
Flower Oil

ఒక వెడల్పాటి గిన్నెలో నీటిని మరిగించి, అందులో ఈ మిశ్రమం కలిగిన జార్‌ని ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. చల్లారిన తర్వాత 24 గంటల పాటు పక్కన పెట్టి ఈ తర్వాత వడగట్టి వాడుకోవాలి. నూనె వడకట్టిన తర్వాత మిగిలిన పిప్పిని మాయిశ్చరైజింగ్ స్క్రబ్‌గా వాడచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!