కోతులు కూడా ఇంత సహనంగా ఉంటాయా? ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!!
మానవులు - జంతువుల మధ్య సంబంధాలు ఎంత అపురూపంగా, అందంగా ఉంటాయో అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో కనిపించే కొన్ని వీడియోలను చూస్తే తెలుస్తుంటుంది. మనుషులు - శునకాలు, పిల్లులు, కోతులు వంటి జంతువుల మధ్య సాన్నిహిత్యం చూడటానికి ఎంతో అబ్బురంగా ఉంటాయి. కొన్నివీడియోలు చూస్తే తెలియకుండానే మన ముఖంపై చిరునవ్వును తెప్పిస్తాయి. ఒక్కోసారి మనుషుల కంటే జంతువులే మేలు అని కూడా..

మానవులు – జంతువుల మధ్య సంబంధాలు ఎంత అపురూపంగా, అందంగా ఉంటాయో అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో కనిపించే కొన్ని వీడియోలను చూస్తే తెలుస్తుంటుంది. మనుషులు – శునకాలు, పిల్లులు, కోతులు వంటి జంతువుల మధ్య సాన్నిహిత్యం చూడటానికి ఎంతో అబ్బురంగా ఉంటాయి. కొన్నివీడియోలు చూస్తే తెలియకుండానే మన ముఖంపై చిరునవ్వును తెప్పిస్తాయి. ఒక్కోసారి మనుషుల కంటే జంతువులే మేలు అని కూడా అనిపిస్తుంటుంది. అలాగే మనసుకి కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ఈ వైరల్ వీడియో కూడా ఆ కోవకు చెందినదే.
సాధారణంగా కోతిని సామెతగా వర్ణించాలంటే.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా అని అంటుంటారు పెద్దలు. అంటే దానికి దొరికితే చాలు.. పట్టుకుని పారిపోతుందని అర్థమనమాట. కానీ ఈ కోతి కొంచెం క్రమశిక్షణ కలిగిన కోతిలా ఉన్నట్టుంది. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు 9.7 మిలియన్ల వీక్షణలు వచ్చిన ఈ వైరల్ వీడియోలో కోతి క్రమశిక్షణకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.




ఓ వ్యక్తి ఒక పెద్దసైజు పుచ్చకాయను కోతి ముందు ఉంచాడు. దానిని చూడటమే అది ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. అయితే ఆ వ్యక్తి దానిని కట్ చేయగానే తీసుకుని తినలేదు. రెండుగా కట్ చేసిన పుచ్చకాయలో కొంతభాగాన్ని కోసి ఇచ్చేంతవరకూ వెయిట్ చేసింది. అతను పుచ్చకాయ ముక్క చేతికివ్వగానే.. ఎంతో క్యూట్ గా దానిని ఆరగించింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు దాని క్రమశిక్షణకు ఫిదా అవుతున్నారు. “సహనానికి తగిన ప్రతిఫలం దక్కింది” అని ఒకరు కామెంట్ చేస్తే.. “ప్రపంచం ఎలా ఉండాలో ఈ వీడియో చూసి నేర్చుకోవాలి” అని మరొకరు కామెంట్ చేశారు. కోతికి ఎంత ఓపిక, ఆసక్తి ఉన్నాయో అని ఇంకొకరు అన్నారు. ఇలా ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ మిలియన్ల వ్యూస్, లక్షల లైకులు, వేల రీ ట్వీట్లు, వందల కామెంట్లు వస్తున్నాయి. ఈ వైరల్ క్యూట్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Eating a watermelon together.. 😊 pic.twitter.com/SLnotXCdZL
— Buitengebieden (@buitengebieden) July 30, 2023