AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Call Girl: అప్పు తిరిగి తీర్చమని అడిగినందుకు… కాల్ గర్ల్ అంటూ షేర్ చాట్ లో నెంబర్ పెట్టిన ప్రబుద్ధుడు

Call Girl: డబ్భులు ఇప్పుడు ఇచ్చి పుచ్చుకోవడం కాదు.. ఇప్పుడు ఓన్లీ ఇవ్వడమే... ఎవరినైనా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగారంటే ఎంత కోపం వస్తుందో....

Call Girl: అప్పు తిరిగి తీర్చమని అడిగినందుకు... కాల్ గర్ల్ అంటూ షేర్ చాట్ లో నెంబర్ పెట్టిన ప్రబుద్ధుడు
Boy On Mobile Game
Surya Kala
|

Updated on: Apr 20, 2021 | 6:53 PM

Share

Call Girl: డబ్భులు ఇప్పుడు ఇచ్చి పుచ్చుకోవడం కాదు.. ఇప్పుడు ఓన్లీ ఇవ్వడమే… ఎవరినైనా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగారంటే ఎంత కోపం వస్తుందో చాలామందికి అనుభవమే.. అయితే ఇప్పుడు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని ఓ మహిళ అడిగిన పాపానికి ఏకంగా కాల్ గర్ల్ ని చేశాడు ఓ దుర్మార్గుడు.. ఆ మహిళకి సంబంధించిన ఫోన్ నేబర్ ను షేర్ చాట్ లో కాల్ గర్ల్ అంటూ పెట్టేశాడు ఆ ప్రబుద్దుడు. ఈ ఘటన రాచకొండ సైబర్ క్రైమ్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే

రంగారెడ్డి జిల్లా మగ్గుల మండలం, కలకండ గ్రామానికి చెందిన నాగిల్లా యశ్వంత్‌ (19) తన బంధువుల వద్ద రూ.2వేల అప్పు తీసుకున్నాడు. అయితే యశ్వంత్ ఆ డబ్బులను చాలా రోజులైనా తిరిగి ఇవ్వలేదు.. దీంతో తమ డబ్బులు ఇవ్వమని చాలాసార్లు ఫోన్ చేసి అడిగారు. అప్పటికీ సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోవడంతో.. చివరికి యస్వంత్ తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పారు. దీంతో యశ్వంత్ ను అతని తల్లిదండ్రులు మందలించారు.

తల్లిదండ్రులకు తన విషయం చెప్పారని మనసులో వారిపై అక్కసు పెంచుకున్నాడు.. ఎలాగైనా సరే వారిని ఇబ్బంది పెట్టాలని.. పరువు తీయాలని ప్లాన్ వేశాడు. వారి పరువు తియ్యాలని షేర్ చాట్‌లో బాధితురాలి ఫోన్ నంబర్ పెట్టి కాల్ గర్ల్ అంటూ పోస్ట్ చేశాడు.

అప్పటి నుంచి బాధిత మహిళకు రోజూ ఫోన్ రావడం.. అందులో అవతలివారు అసభ్యంగా మాట్లాడడం చేస్తున్నారు. దీంతో ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: మీలో ఈ ఐదు లక్షణాలు కరోనా వైరస్ ఉన్నాయా.. ఆయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సిందే..