బెంగళూరులో భార్యను.. కోల్‌కతాలో అత్తను.. ఆ తర్వాత ఆత్మహత్య

ఓ చిన్న గొడవ పచ్చని కటుంబంలో నిప్పులు పోసింది. ముగ్గురుని కాటికి చేర్చింది. బెంగళూరులో భార్యను చంపాడు, కోల్‌కతాకు వెళ్లి అత్తాను హత్య చేశాడు, తరువాత తానూ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు.

బెంగళూరులో భార్యను.. కోల్‌కతాలో అత్తను.. ఆ తర్వాత ఆత్మహత్య
Follow us

|

Updated on: Jun 23, 2020 | 4:10 PM

కుటుంబ కలహాలు మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. బెంగళూరులో భార్యను చంపాడు, కోల్‌కతాకు వెళ్లి అత్తాను హత్య చేశాడు, తరువాత తానూ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కోల్‌కతాకు చెందిన అమిత్ అగర్వాల్(42) భార్య శిల్పతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా భార్య, భర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరు విడాకులు తీసుకోవాలని భావించారు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరింది. సోమవారం బెంగళూరు నుంచి కోల్‌కతాలో ఉంటున్న అత్తగారింటికి వెళ్లిన అగర్వాల్.. అత్తగారు లలితా ధంధానియాను (60) కొట్టి చంపి తనను తాను కాల్చుకున్నట్లు కోల్‌కతా పోలీసు అధికారి తెలిపారు. తన భార్య శిల్పిని బెంగళూరులో చంపినట్లు అమిత్ అగర్వాల్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని సూసైడ్ నోట్ అధారంగా బెంగళూరు పోలీసులకు కోల్‌కతా పోలీసులు సమాచారమిచ్చారు. దీంతో పోలీసు బృందం శిల్పి ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకుని ఆమె మృతదేహాన్ని గుర్తించారు. శిల్పి మృతదేహం వంటగదిలోని అల్మరా పక్కన పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం నిజాలు వెల్లడిస్తామని స్థానిక బెంగళూరు పోలీసులు తెలిపారు.

అయితే, సోమవారం అగర్వాల్ బెంగళూరు నుంచి నేరుగా కోల్‌కతాలోని అత్త లలితా ధంధానియా ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడ తన బావమరిది సుభాస్ ధంధానియా, అత్తగారితో వాదనకు దిగాడు. ఇంతలో హఠాత్తుగా వెంట తెచ్చుకున్న తుపాకితో లలితపై చాలా దగ్గరగా కాల్పులు జరిపాడు అగర్వాల్. ఇరుపొరుగు వారు అప్రమత్తం అయ్యేలోపే తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కోల్‌కతా పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడ్డ తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.