భార్యకు ఎక్కువ జీతం.. సహించలేక హత్యచేసిన భర్త

తనకంటే భార్యకు ఎక్కువ జీతం రావడాన్ని సహించలేకపోయాడు ఓ భర్త. దీంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా హతమార్చాడు ఆ కర్కశుడు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన రావి ధనుంజయరావు, ధనలక్ష్మిల కుమార్తె జయమాధవి వివాహం విజయవాడకు చెందిన వెంకట సుబ్రహ్మణ్యంతో గత ఏడాది జరిగింది. కట్నం కింద సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.30 లక్షల డబ్బు, 30 తులాల […]

భార్యకు ఎక్కువ జీతం.. సహించలేక హత్యచేసిన భర్త
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2019 | 5:16 PM

తనకంటే భార్యకు ఎక్కువ జీతం రావడాన్ని సహించలేకపోయాడు ఓ భర్త. దీంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా హతమార్చాడు ఆ కర్కశుడు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన రావి ధనుంజయరావు, ధనలక్ష్మిల కుమార్తె జయమాధవి వివాహం విజయవాడకు చెందిన వెంకట సుబ్రహ్మణ్యంతో గత ఏడాది జరిగింది. కట్నం కింద సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.30 లక్షల డబ్బు, 30 తులాల బంగారం, ఆడపడచు లాంఛనాల కింద 2లక్షలు, అరకేజి వెండి ఇచ్చారు జయమాధవి తండ్రి. ఈ ఇద్దరు బెంగళూరులోని వేర్వేరు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. మొదట్లో వీరిద్దరి సంసారం బాగానే సాగింది. అయితే ఏమైందో తెలీదు గానీ.. ఒక్కసారిగా సుబ్రహ్మణ్యంలో మార్పు వచ్చింది.

తనకంటే జయమాధవి ఎక్కువ సంపాదిస్తుందనే ఈర్ష్య, తక్కువ కట్నం వచ్చిందన్న మనోవేదనతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల జయమాధవి గర్భవతి అయింది. అయితే ఈ విషయం తెలిసి సంతోషించాల్సిన సుబ్రహ్మణ్యం అప్పటి నుంచి మరింతగా వేధించసాగాడు. ఈ నేపథ్యంలో శనివారం జయమాధవిని హత్య చేశాడు సుబ్రహ్మణ్యం.

విషయం తెలుసుకున్న జయమాధవి తల్లిదండ్రులు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను చిత్రహింసలకు గురి చేసి, హత్య చేసినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. మరో ఇద్దరు నిందితులైన సుబ్రహ్మణ్యం తల్లి, సోదరి పరారీలో ఉన్నారు. అయితే పెళ్లైన నాలుగో రోజు అత్తారింటికి వెళ్లిన జయమాధవి.. అప్పటి నుంచి పుట్టింటికి రాలేదు. ఇప్పుడు రక్తపు ముద్దగా ఆమె మృతదేహం పుట్టింటికి చేరడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Latest Articles
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
వృషభ రాశిలో గురువు సంచారం.. ఈ రాశుల వారికి అరుదైన యోగాలు.. !
వృషభ రాశిలో గురువు సంచారం.. ఈ రాశుల వారికి అరుదైన యోగాలు.. !
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..