Viral Video: మహిళకు సహాయం చేసిన వ్యక్తి… తర్వాత సీన్ రివర్స్.. నవ్వాలో అయ్యో పాపం అనాలో..
అప్పుడప్పుడూ మనం అనుకుంటూ ఉంటాం.. ఇతరులకు మంచి చేసినా మనకు చెడే జరుగుతుంది... ఇదెక్కడి గొడవరా బాబు అని... సరిగ్గా అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌చేస్తుంది.
అప్పుడప్పుడూ మనం అనుకుంటూ ఉంటాం.. ఇతరులకు మంచి చేసినా మనకు చెడే జరుగుతుంది… ఇదెక్కడి గొడవరా బాబు అని… సరిగ్గా అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌చేస్తుంది. అసలేమైందంటే… ఒక వ్యక్తి కార్యాలయంలో కంప్యూటర్ వద్ద కూర్చొని పని చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక మహిళ ఆ గది నుంచి బయటకు వెళ్లడానికి అటుగా వస్తుంది. అయితే అక్కడి డోర్ మూసి ఉంది. మరోవైపు ఆ మహిళ చేతిలో కొన్ని వస్తువులు ఉన్నాయి. అది గమనించిన ఆ వ్యక్తి తన కుర్చీ నుంచి పైకి లేచి తలుపు తీశాడు. ఆమె బయటకు వెళ్లేందుకు సహకరించాడు. కాగా, చైర్ నుంచి పైకి లేచే క్రమంలో ఆ వ్యక్తి దానిని వెనక్కి తోశాడు. ఇది గమనించకుండా అతను తిరిగి తన సీట్‌లో కూర్చొనేందుకు ప్రయత్నించాడు. అక్కడ కుర్చీ లేకపోవడంతో కిందపడిపోయాడు. ఆ షాక్ నుంచి తేరుకోలేక కొంతసేపు అలాగే ఉండిపోయాడు. కాగా ఈ సీన్ మొత్తం ఆ ఆఫీస్‌లోని సీసీటీవీలో రికార్డైంది. పంజాబ్ ఇండస్ట్రీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వ్యక్తి కుర్చీలో కూర్చొబోయి కిందపడటం చూసి పలువురు నెటిజన్లు నవ్వుకున్నారు. లాఫింగ్ ఇమోజీలతో పలు కామెంట్లు చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

