గూగుల్ మ్యాప్‌ని గుడ్డిగా నమ్మి.. గడ్డకట్టిన నదిలో పడ్డ యువకుడు!
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత జనాలు ‘బుర్ర’ ఉపయోగించడం మానేశారు. ఒకప్పుడు మెదడులో గుర్తుపెట్టుకొనే విషయాలను నేరుగా స్మార్ట్ ఫోన్లలో దాచుకుంటున్నారు. ‘గూగుల్’ సెర్చ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బద్దకం మరింత పెరిగిపోయింది. దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. అమెరికాలో ఓ చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మినియాపాలిస్‌లో ఓ యువకుడు నదికి అవతల ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్‌ను అనుసరించాడు. అది చూపించిన దారిలో నడుస్తూ నేరుగా గడ్డకట్టిన మిస్సిస్సిపీ […]
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత జనాలు ‘బుర్ర’ ఉపయోగించడం మానేశారు. ఒకప్పుడు మెదడులో గుర్తుపెట్టుకొనే విషయాలను నేరుగా స్మార్ట్ ఫోన్లలో దాచుకుంటున్నారు. ‘గూగుల్’ సెర్చ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బద్దకం మరింత పెరిగిపోయింది. దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు.
అమెరికాలో ఓ చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మినియాపాలిస్‌లో ఓ యువకుడు నదికి అవతల ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్‌ను అనుసరించాడు. అది చూపించిన దారిలో నడుస్తూ నేరుగా గడ్డకట్టిన మిస్సిస్సిపీ నదిలోకి వెళ్లాడు. మంచు ముక్కలు కావడంతో నదిలో పాక్షికంగా మునిగిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు అతడిని రక్షించే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరిన రెస్క్యూ టీమ్ అతడిని రక్షించి హాస్పిటల్‌కు తరలించారు.
అయితే.. గూగుల్ మ్యాప్‌లో చూపించిన దారిలో నడవడం వల్లే తాను నదిలో చిక్కుకున్నానని బాధితుడు తెలిపాడు. వాస్తవానికి అతడు గమ్యం చేరాలంటే.. స్టోన్ ఆర్క్ బ్రిడ్జ్‌ను దాటాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా గూగుల్ అతడిని నదిని దాటి వెళ్లాలని చెప్పిందే గానీ, నదిలో నుంచి వెళ్లమని చెప్పలేదని.. అతడు పొరపాటును ఆ మార్గంలో వెళ్లి ఉంటాడని తెలుస్తోంది.
కాగా.. కొద్ది రోజుల కిందట గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని విమానాశ్రయానికి వెళ్లేందుకు షార్ట్ కట్‌లో ప్రయాణిస్తూ కొందరు బురదలో చిక్కుకున్నారు. కాబట్టి.. టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు మన బుర్రను కూడా ఉపయోగించడం ఉత్తమం.