ప్రధానిగా రాహుల్ కంటే బాబు, మమతా, మాయావతి బెటర్ ఆప్షన్స్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతర పక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ప్రధాని పదవి విషయంలో రాహుల్ గాంధీ కంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మేలు అని అన్నారు. ఈ విషయంలో రాహుల్ కంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బెటర్ ఆప్షన్ అవుతారని అన్నారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో […]
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతర పక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ప్రధాని పదవి విషయంలో రాహుల్ గాంధీ కంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మేలు అని అన్నారు. ఈ విషయంలో రాహుల్ కంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బెటర్ ఆప్షన్ అవుతారని అన్నారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎన్డీయేతర మహాకూటమి ఉందా ? అని ప్రశ్నించారు. ఎన్నికల తరువాత ఎన్డీయేలో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని శరద్ పవార్ అన్నారు.ఎన్డీయేలోని కొన్ని పార్టీలను ఎన్నికల తరువాత తమ కూటమిలోకి తీసుకొస్తామని పవార్ అన్నారు.