మలక్ పేట్ ఆస్పత్రిలో కరోనా కలవరం.. ఆపరేషన్లు నిలివేత..!

కరోనా ధాటికి ఆస్పత్రులే మూతపడుతున్నాయి. తాజాగా మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు కొవిడ్ సోకడంతో మరో రెండు రోజులపాటు ఆపరేషన్లు నిలిపివేస్తున్నట్లు హాస్పిటల్స్ ఆర్ఎంవో మల్లికార్జునప్ప తెలిపారు.

మలక్ పేట్ ఆస్పత్రిలో కరోనా కలవరం.. ఆపరేషన్లు నిలివేత..!
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 26, 2020 | 7:14 PM

కరోనా ధాటికి ఆస్పత్రులే మూతపడుతున్నాయి. తాజాగా మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు కొవిడ్ సోకడంతో మరో రెండు రోజులపాటు ఆపరేషన్లు నిలిపివేస్తున్నట్లు హాస్పిటల్స్ ఆర్ఎంవో మల్లికార్జునప్ప తెలిపారు. రెండు రోజుల క్రితం ఇద్దరు వైద్యులతో పాటు 9 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో తాత్కాలికంగా ఇన్ పేషేంట్స్ వార్డును, ఆపరేషన్లను నిలిపివేశామన్నారు. తాజాగా మరో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులతో సహా మరో ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. దింతో మరో రెండు రోజుల పాటు ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ సేవలు నిలిపివేస్తున్నట్లు అర్ఎంవో వెల్లడించారు. ఒపి లు మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నట్లుగా వివరించారు