మానవత్వం చాటుకున్న వృద్ధురాలు..
మహిళామణులు పొదుపులోనే కాదు మానవత్వం చాటడంలో కూడా ముందుంటామని నిరూపించింది ఓ వృద్ధురాలు. తోటి వారిని అదుకోవడానికి తన వంతు సాయం అందించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆ వృద్ధురాలు రూ.10 వేల ఆర్థికసాయం అందించి ఉదారత చాటుకొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా యాపదిన్నెకు చెందిన అంజన్‌రెడ్డి కొంత కాలంగా వెన్నెముక వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కుటుంబం అతి నిరుపేద కుటుంబం కావడం ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. మందులకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాడు. అంజన్‌రెడ్డి కుటుంబ పరిస్థితిని చూసి చలించిన అదే గ్రామానికి చెందిన జములమ్మ ఆర్థికంగా ఆదుకోవాలనుకుంది. దీంతో తాను దాచుకొన్న పింఛన్ డబ్బులు రూ.10 వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన వృద్ధురాలు జములమ్మను గ్రామస్థులు అభినందించారు. ఆపదలో ఉన్న తోటివారికి సాయం అందించేందుకు జములమ్మను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.