నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం

పుదుచ్చేరిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అక్కడ ప్రజా ప్రతినిధులు కూడా ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఇద్దరు..

నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 11, 2020 | 11:37 AM

పుదుచ్చేరిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అక్కడ ప్రజా ప్రతినిధులు కూడా ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి సీఎం వీ నారాయణ సామి తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తన క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులు కంద‌సామి, క‌మ‌ల క‌న్న‌న్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరు క్వారంటైన్‌లో ఉన్నారని వెల్లడించారు. కరోనా బారినపడ్డ ఇద్దరు మంత్రులతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారితో పాటు.. వారు పాల్గొన్న కార్యక్రమాల్లో హాజరైన వారు, అధికారులు క్వారంటైన్‌లో ఉంటూ.. పరీక్షలు చేయించుకోవాలని సీఎం తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా కోరారు. మంత్రులిద్దరు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు సీఎం నారాయణ సామి తెలిపారు.

Read More :

దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు