తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలపై.. కేంద్ర బృందం ప్రశంసలు..!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు టెలి మెడిసిన్‌ సేవలు, వారి పర్యవేక్షణను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలపై.. కేంద్ర బృందం ప్రశంసలు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 11, 2020 | 11:39 AM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు టెలి మెడిసిన్‌ సేవలు, వారి పర్యవేక్షణను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతిలో ప్రవేశపెట్టిన ‘హితం’యాప్‌ను నీతి ఆయోగ్‌ సభ్యులు వినోద్‌ కుమార్‌ పాల్‌ అభినందించారు. పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ అహుజా, రవీంద్రన్‌లతో కూడిన కేంద్ర బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు హైదరాబాద్‌లో పర్యటించింది.

రాష్ట్రంలో కరోనా టెస్టులను పెంచారని, ఇది వైరస్‌ నియంత్రణకు కీలకమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఆస్పత్రుల సన్నద్ధత స్థాయి, వైరస్‌ నివారణ చర్యలు, రోగులకు చికిత్స వంటి అంశాలపై సంతృప్తి వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల ప్రాణాలు కాపాడటానికి 24 గంటలు పని చేస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో టెస్టింగ్, కరోనా ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌ పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు.టెస్టింగ్‌లను ప్రతిరోజు 40 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు కరోనా నియంత్రణకు ప్రత్యేక నిధులు కేటాయించామని పేర్కొన్నారు.

Read More:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు