AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 30వేలకు ఆశపడ్డ తల్లి..9 ఏళ్ల కూతురికి పెళ్లి

మన దేశంలో అనాదిగా వస్తున్న దురాచారాల్లో బాల్య వివాహం కూడా ఒకటి. 18 ఏళ్లు నిండాకే అమ్మాయిలకే పెళ్లిల్లు చేయాలని చట్టం ఎంత మొత్తుకుంటున్నా కొన్ని చోట్ల మాత్రం పట్టించుకునే వారు లేకుండా పోతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే వారు చెప్పుకోలేన బాధలను అనుభవించాల్సి వస్తోంది. ఓ వైపు ఆరోగ్యం బాగా లేక, మరో వైపు సమాజం విధించే కట్టుబాట్లను ఎదిరించలేక, విధికి తలొగ్గి బతుకు పోరాటంలో అలాగే ముందుకు సాగుతూ జీవితం వెల్లదీస్తున్నారు. దీంతో కొంత […]

రూ. 30వేలకు ఆశపడ్డ తల్లి..9 ఏళ్ల కూతురికి పెళ్లి
Pardhasaradhi Peri
|

Updated on: Nov 13, 2019 | 5:18 PM

Share

మన దేశంలో అనాదిగా వస్తున్న దురాచారాల్లో బాల్య వివాహం కూడా ఒకటి. 18 ఏళ్లు నిండాకే అమ్మాయిలకే పెళ్లిల్లు చేయాలని చట్టం ఎంత మొత్తుకుంటున్నా కొన్ని చోట్ల మాత్రం పట్టించుకునే వారు లేకుండా పోతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే వారు చెప్పుకోలేన బాధలను అనుభవించాల్సి వస్తోంది. ఓ వైపు ఆరోగ్యం బాగా లేక, మరో వైపు సమాజం విధించే కట్టుబాట్లను ఎదిరించలేక, విధికి తలొగ్గి బతుకు పోరాటంలో అలాగే ముందుకు సాగుతూ జీవితం వెల్లదీస్తున్నారు. దీంతో కొంత మంది నడివయస్సు వచ్చే సరికి తీవ్రమైన అనారోగ్యాలు, వ్యాధుల బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంకా కొందరు ఎంతగానో మానసిక క్షభను, ఆవేదనను అనుభవిస్తున్నారు. అయితే, ఒకప్పుడు దీని ప్రభావం మన దగ్గర బాగా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అంతగా లేదని చెప్పాలి. ఎక్కడో ఓ చోట మాత్రం ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరుగుతున్న బాల్య వివాహన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఔరంగాబాద్‌ జిల్లా మజల్‌గావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అషమతి గోలాప్‌ అనే మహిళ తన 9 ఏళ్ల కూతురిని వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అషమతి స్నేహితురాలు ఉర్మిళా యాదవ్‌ 20 ఏళ్ల కొడుకుతో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. బదులుగా వరుడి తరపు నుంచి రూ. 30 వేల నగదు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో నాలుగు రోజుల్లో ముహూర్తం కూడా పెట్టించారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా విషయం బయటకు తెలిసి పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..పెళ్లిని ఆపించేశారు. బాల్య వివాహం చేసేందుకు సిద్దపడిన బాధ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Follow Us
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్