కంగనా-డ్రగ్స్ లింక్ పై దర్యాప్తు జరిపిస్తాం., మహారాష్ట్ర ప్రభుత్వం

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి, డ్రగ్స్ కి మధ్య లింక్ ఉందన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేస్తుందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. కంగనా డ్రగ్స్ సేవించేదని..

  • Umakanth Rao
  • Publish Date - 4:03 pm, Tue, 8 September 20
కంగనా-డ్రగ్స్ లింక్ పై దర్యాప్తు జరిపిస్తాం., మహారాష్ట్ర ప్రభుత్వం

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి, డ్రగ్స్ కి మధ్య లింక్ ఉందన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేస్తుందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. కంగనా డ్రగ్స్ సేవించేదని, పైగా ఇది తీసుకోవాలని తనపై ఒత్తిడి కూడా చేసేదని నటుడు అధ్యాయన్ సుమన్ లోగడ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొదట దీనిపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతారని అనిల్ పేర్కొన్నారు. కాగా సుమన్, కంగనా కొన్నేళ్ల క్రితం డేటింగ్ కూడా చేశారట.