గట్టిగా మాట్లాడినా కరోనా వ్యాప్తి, హిమాచల్ అసెంబ్లీ స్పీకర్ విపిన్ సింగ్
ఈ కరోనా కాలంలో గట్టిగా మాట్లాడినా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ విపిన్ సింగ్ పార్మర్ సంచలన వ్యాఖ్య చేశారు. అందువల్లే ముఖ్యంగా శాసనసభా సమావేశాలు జరుగుతున్నప్పుడు సభ్యులు..
ఈ కరోనా కాలంలో గట్టిగా మాట్లాడినా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ విపిన్ సింగ్ పార్మర్ సంచలన వ్యాఖ్య చేశారు. అందువల్లే ముఖ్యంగా శాసనసభా సమావేశాలు జరుగుతున్నప్పుడు సభ్యులు కచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆయన కోరారు.( బీజేపీ ఎమ్మెల్యే రీటాదేవికి కరోనా పాజిటివ్ సోకింది).. గట్టిగా మాట్లాడవద్దని సాధారణ స్థాయిలో మాట్లాడాలని విపిన్ సింగ్ సూచించినప్పుడు సభ్యులు ఫక్కున నవ్వారు. కొందరు కావాలనే గట్టిగా ప్రసంగించారు. ప్రతిపక్షనేత ప్రవేశపెట్టిన ఓ తీర్మానంపై చర్చ జరుగుతుండగా ఈ ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఏమైనా.. సభ్యులంతా సాధ్యమైనంతవరకు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని విపిన్ సింగ్ సూచించారు.