కంగనాపై వచ్చిన డ్రగ్ ఆరోపణలపై మహా సర్కారు దర్యాప్తు
బాలీవుడ్ నిప్పుకణం కంగనా రనౌత్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకే వెళుతుంది.. తన కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత కంగనా మరింత దూకుడుగా వెళుతున్నారు..
బాలీవుడ్ నిప్పుకణం కంగనా రనౌత్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకే వెళుతుంది.. తన కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత కంగనా మరింత దూకుడుగా వెళుతున్నారు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కంగనాపై వచ్చిన డ్రగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమయ్యింది.. ఈ మేరకు ముంబాయి పోలీసులను దర్యాప్తు చేయమని కోరింది.. నిషేధిత పదార్థాలు, నార్కోటిక్స్ డ్రగ్స్‌ను కంగనా వాడతారనే ఆరోపణల నిగ్గు తేల్చాల్సిందిగా ముంబాయి పోలీసులకు ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది. కంగనా రనౌత్ కొకైన్ వాడతారని, తనను కూడా మాదకద్రవ్యాలను తీసుకోవాలని కోరారని నాలుగేళ్ల కిందట ఆధ్యయన్ సుమన్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తవ్వితీసింది.. 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌పై అధ్యయన్ సుమన్ పలు ఆరోపణలు చేశారు.. ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర హోమ్‌మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అసెంబ్లీలో ప్రస్తావించారు.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజాలు రాబట్టాల్సిందిగా ప్రభుత్వం కోరడంతో ముంబాయి పోలీసులు కూడా అందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ అంశంపై సిట్‌తో విచారణ జరిపించాలా? లేక యాంటో నార్కోటిక్స్ విభాగానికి దర్యాప్తు బాధ్యతను ఇవ్వాలా అన్నది ముంబాయి పోలీసులు ఇంకా తేల్చుకోలేదు.. కంగనా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న పోరాటం మున్ముందు మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.