ఏపీకి తుఫాన్ ముప్పు.. 48 గంటల్లో మరో వాయుగుండం

|

Oct 01, 2020 | 5:02 AM

ఒడిసా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రానున్న 48గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిసాతీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఏపీకి తుఫాన్ ముప్పు.. 48 గంటల్లో మరో వాయుగుండం
Follow us on

వరుస వాయుడుగండాలతో ఆంధ్రప్రదేశ్‌ తడిసి ముద్దవుతోంది. మరో వాయుగుండం తాకనుందనే సమాచారం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలను మరింత వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని జలాశయాలు అవసరానికి మించి ప్రవహిస్తున్నాయి. పంటపొలాలు నీటిలోనే నానుతున్నాయి. ఎక్కడ చూసిన వర్షం నీరే కనిపిస్తోంది. అయితే మరో వాయుగుండం ప్రభావంతో 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఒడిసా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రానున్న 48గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిసాతీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా ఒంపు తిరిగి ఉందని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, బుధవారం కర్నూలు జిల్లాలో భారీవర్షాలు కురిశాయి. అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.