అంతరించిపోయిందనుకున్న పాము.. 129 ఏళ్ల తర్వాత కనిపించింది
ఆ పాము అంతరించిపోయింది. వంద సంవత్సరాల దాటిన ఇంతవరకు దాని జాడ కనిపించలేదు. అయితే అనూహ్యంగా ఆ జాతి పాము అసోంలో కనిపించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్టులను ఆశ్చర్యపరిచింది.
ఆ పాము అంతరించిపోయింది. వంద సంవత్సరాల దాటిన ఇంతవరకు దాని జాడ కనిపించలేదు. అయితే అనూహ్యంగా ఆ జాతి పాము అసోంలో కనిపించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్టులను ఆశ్చర్యపరిచింది. వాటి జాతి అంతరించిపోయిందనుకున్న 129 ఏళ్ల తర్వాత ఆ పాము కనిపించడం గమనార్హం. 1891లో హెబియస్ పెల్లీ (అసోం కీల్బాక్) పాములు బ్రిటీష్ టీ ప్లాంటర్ శామ్యూల్ ఎడ్వర్డ్ పీల్ కు తారసపడ్డాయి. ఆయన ఈ జాతికి చెందిన రెండు మగ పాములను సేకరించి..ఒకటి కోల్కతాలోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు, మరొకటి లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియానికి తరలించారు. ఆ తర్వాత హెబియస్ పెల్లీ జాతి పాములు ఎక్కడా, ఎవరికీ కనిపించలేదు.
దాంతో సదరు పాము జాతి అంతరించిపోయిందని..ఇంక అవి కనిపించవని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా 2018 సెప్టెంబర్లో ఎడ్వర్డ్ పీల్ కి కనిపించిన ప్రాంతంలోనే వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులకు మళ్లీ ఈ పాము చిక్కింది. వెటర్బేట్ జువాలజీ అనే ఇంటర్నేషనల్ జర్నల్లో ఈ విషయాన్ని గత శుక్రవారం ప్రచురించారు.
తమకు కనిపించిన పాముకి అసోం కీల్బాక్ ఆనవాళ్లు ఉండటంతో… వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు లండన్ నేచురల్ మ్యూజియంలో ఉన్న పాము ఆనవాళ్లతో పోల్చి చూసుకుని ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. 50 నుంచి 60 సెంటీమీటర్ల వరకూ ఉండే అసోం కీల్బాక్ పాములు అంత విషపూరితమైనవి కావని సైంటిస్టులు తెలిపారు.