ఈ ఐదు చిట్కాలు పాటించండి.. ఈజీగా బరువు తగ్గిపోతారు.. నడుము నాజూగ్గా అవుతుంది..!

|

Nov 03, 2022 | 9:48 AM

ఈ చిట్కాలు మీరు బరువు తగ్గడానికి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు ఈ చిట్కాలను పాటిస్తే ఎక్కువ శ్రమ లేకుండా సులభంగా బరువు తగ్గవచ్చు.

ఈ ఐదు చిట్కాలు పాటించండి.. ఈజీగా బరువు తగ్గిపోతారు..  నడుము నాజూగ్గా అవుతుంది..!
Weight Loss Tips
Follow us on

బరువు తగ్గడం అంత సులభం కాదు. బరువు తగ్గడానికి నెలల సమయం పట్టవచ్చు. కానీ చాలా మంది బరువు తగ్గేందుకు ఆహారం, వ్యాయామంలో మార్పులు చేస్తుంటారు. కానీ, ఇవేవీ సరైన ఫలితాన్ని ఇవ్వవు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం వంటి అలవాట్లను అనుసరిస్తే బరువు తగ్గడం కష్టం కాదు. ఈ చిట్కాలు మీరు బరువు తగ్గడానికి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు ఈ చిట్కాలను పాటిస్తే ఎక్కువ శ్రమ లేకుండా సులభంగా బరువు తగ్గవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రొటీన్ డైట్: మెటబాలిజంను పెంచే పోషకాలలో ప్రొటీన్ రా రాజుగా చెబుతారు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. చికెన్, గుడ్లు, చేపలు, పెరుగు, పనీర్ వంటి ఆహారాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఉదయం అల్పాహారం తినండి: ఒకేసారి తక్కువ ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. అల్పాహారంలో భాగంగా పండ్లు, కూరగాయలు, గింజలు తీసుకోవచ్చు. తాజా పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇది సంపూర్ణత్వం అనుభూతిని కలిగిస్తుంది. వోట్స్, హోల్ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బఠానీలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జంపింగ్ జాక్స్: ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అన్ని ప్రధాన కండరాలు ఉత్తేజితమవుతాయి. గ్లూట్స్, హామ్ స్ట్రింగ్స్, క్వాడ్స్, హిప్స్, షిన్స్‌లను బలపరుస్తుంది. ఈ వ్యాయామం శక్తిని పెంపొందించడానికి, ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది.

నీరు త్రాగండి: హైడ్రేటెడ్ గా ఉండటానికి పుష్కలంగా నీరు త్రాగాలి. భోజనానికి 30 నిమిషాల ముందు నీరు త్రాగడం వల్ల తినే ఆహారాన్ని తగ్గించవచ్చు.

శీతల పానీయాలకు దూరంగా ఉండండి: శీతల పానీయాలు తాగకపోవడమే మంచిది. అలాగే, ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించండి. బరువు పెరగడానికి దారితీసే కారకాల్లో ఇది ఒకటి. పోషక విలువల కోసం స్మూతీస్ మరియు ఇంట్లో తయారుచేసిన జ్యూస్‌లకు ప్రాధాన్యత ఇవ్వండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి