బ్యూటీ కంటెస్ట్‌లో ఘర్షణ.. పొట్టుపొట్టుకొట్టుకున్న వైనం !!

బ్యూటీ కంటెస్ట్‌లో ఘర్షణ.. పొట్టుపొట్టుకొట్టుకున్న వైనం !!

Phani CH

|

Updated on: Nov 03, 2022 | 9:41 AM

అమెరికాలో జరిగిన మిస్‌ శ్రీలంక పోటీలు వివాదాస్పదమయ్యాయి. పోటీలు ముగిసిన తర్వాత రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

అమెరికాలో జరిగిన మిస్‌ శ్రీలంక పోటీలు వివాదాస్పదమయ్యాయి. పోటీలు ముగిసిన తర్వాత రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. మహిళలు, పురుషులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. న్యూయార్క్‌ సమీపంలోని స్టేటన్‌ ఐలాండ్‌లో మిస్‌ శ్రీలంక పోటీలకు సుమారు 300 మంది ఆ ఈవెంట్‌కు హాజరయ్యారు. అయితే ఈ గొడవకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనలో కొంత ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్టేట్‌ ఐలాండ్‌లో ఎక్కువ సంఖ్యలో లంకేయులు నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ దీవిలోనే మిస్‌ శ్రీలంక పోటీలు నిర్వహించాలని ఆర్గనైజర్లు భావించారు. ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ దేశాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో స్టేట్‌ ఐలాండ్‌లో మిస్‌ శ్రీలంక పోటీలను నిర్వహించారు. అయితే పోటీలో పాల్గొన్న 14 మంది కాంటెస్టెంట్లలో ఎవరు కూడా గొడవకు దిగలేదని మిస్‌ శ్రీలంక పోటీ నిర్వాహకులు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నవ వధువుకు వరుడు సూపర్‌ సర్‌ప్రైజ్‌.. బోరున ఏడ్చేసిన పెళ్లికూతురు !!

భక్తితో దేవుడ్ని ప్రార్థించాడు.. ఆ తర్వాత ఏంచేశాడో చూడండి

వామ్మో !! ఎంత ధైర్యం ?? మెడలో పాము ఆపై డ్యాన్స్

ఇదేం స్టంట్‌రా బాబూ.. బాహుబలిని మించిపోయాడు !!

హెయిర్‌కట్‌ చేస్తుండగా అనుకోని ఘటన.. పరుగో పరుగు..

 

Published on: Nov 03, 2022 09:41 AM