హెయిర్‌కట్ చేస్తుండగా అనుకోని ఘటన.. పరుగో పరుగు..
ఇటీవల కాలంలో యూత్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఫ్యాషన్‌కు అలవాటు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ముఖ్యంగా హేర్ స్టైల్ కోసం రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు.
ఇటీవల కాలంలో యూత్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఫ్యాషన్‌కు అలవాటు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ముఖ్యంగా హేర్ స్టైల్ కోసం రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. ఫ్యాషన్‌కు తగ్గట్టుగా సెలూన్‌లు సైతం పలు రకాల హెయిర్ కట్‌లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. షాట్ హెయిర్ కట్ అని.. ఫేడ్, బజ్, సైడ్ కట్, ఫ్లాట్ కట్ ఇలా రకరకాలుగా యువత తమ జుట్టును స్టైల్‌గా కట్ చేయించుకుంటుంటారు. వీటిని ఒక్కోదాన్ని ఒక్కో విధంగా కట్ చేస్తారు. అయితే, ప్రస్తుతం ‘ఫైర్ హెయిర్‌కట్’ అనేది ట్రెండ్ అవుతోంది. ఈ ఫైర్ హెయిర్ కట్ చేయించుకోవడం అంటే సాహసంతో కూడుకున్నదే. మంటను ఉపయోగించి జుట్టును మనకు కావాల్సిన స్టైల్‌లో సెట్ చేస్తారన్న మాట. ఈ పద్ధతిలో ఏమాత్రం పట్టుతప్పినా గాయాలపాలు కావాల్సింది. అలాంటి ఘటనే ఒకటి గుజరాత్‌లో చోటు చేసుకుంది. వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణంలోని భడక్‌మోరా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ‘ఫైర్ హెయిర్ కట్’ కోసం సెలూన్‌కు వెళ్లాడు. అక్కడ హెయిర్ కట్ చేయించుకుంటుండగా.. తల భాగంలో ఒక్కసారిగా పెద్ద మంట చెలరేగింది. మంటను అదుపు చేసే క్రమంలో యువకుడి మెడ, శరీరంపై గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు..
మహిళపై పెంపుడు కొండచిలువ ఎటాక్.. ఏం చేసిందో చూడండి !!
ఇక్కడ మేఘాలను తాకచ్చు !! వర్షం అస్సలు కురవదు !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

