మహిళపై పెంపుడు కొండచిలువ ఎటాక్.. ఏం చేసిందో చూడండి !!
ఓ మహిళ తన ఇంట్లో కొండచిలువను పెంచుకుంటోంది. ఓ గాజు బాక్సులో ఉంచి దానికి రోజూ ఆహారం వేస్తూ ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటుంది.
ఓ మహిళ తన ఇంట్లో కొండచిలువను పెంచుకుంటోంది. ఓ గాజు బాక్సులో ఉంచి దానికి రోజూ ఆహారం వేస్తూ ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటుంది. రోజూలాగే ఓ రోజు కొండచిలువను పరామర్శించేందుకు గాజు బాక్సు మూత తెరిచింది. అంతే కొండచిలువ తల బయటకి పెట్టింది. మహిళ దాన్ని ప్రేమతో నిమరడానికి ప్రయత్నించింది. అంతే ఒక్కసారిగా ఆమె చేతిని పట్టేసుకుని కరిచేసింది. చూస్తుండగానే చేతికి మొత్తం చుట్టుకుపోయి.. ఉక్కిరిబిక్కిరి చేసేసింది. పక్కనే ఉన్న మరోవ్యక్తి అది గమనించి కొండచిలువ పట్టునుంచి మహిళను విడిపించే ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నించినా కొండచిలువ మాత్రం పట్టు విడవలేదు. చేయిని గట్టిగా పట్టుకోవడంతో రక్తస్రావం కూడా అయింది. చివరకు ఎలాగోలా దాన్ని పక్కకు లాగేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పాములు, కొండచిలువలను ఇంట్లో పెంచుకోవడం మంచిదికాదని సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక్కడ మేఘాలను తాకచ్చు !! వర్షం అస్సలు కురవదు !!
కోహ్లి చెప్పిన ఆ ఒక్కమాటతో రెచ్చిపోయిన రాహుల్..
అతను ఒక్కరోజు తినే ఫుడ్‌తో చిన్నపాటి ఫంక్షన్ చేయొచ్చట..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

