భక్తితో దేవుడ్ని ప్రార్థించాడు.. ఆ తర్వాత ఏంచేశాడో చూడండి

దొంగలు పలు రకాలు అన్నట్లు.. ఈ దొంగ చాలా వెరైటీ. పాపం వీడికి దేవుడంటే మహా భక్తి. అందుకే దీపావళి పండుగ సందర్భంగా దేవుని దర్శనం చేసుకోవాలనుకున్నాడు.

భక్తితో  దేవుడ్ని ప్రార్థించాడు.. ఆ తర్వాత ఏంచేశాడో చూడండి

|

Updated on: Nov 03, 2022 | 9:37 AM

దొంగలు పలు రకాలు అన్నట్లు.. ఈ దొంగ చాలా వెరైటీ. పాపం వీడికి దేవుడంటే మహా భక్తి. అందుకే దీపావళి పండుగ సందర్భంగా దేవుని దర్శనం చేసుకోవాలనుకున్నాడు. దర్జాగా కారులో గుడికి వెళ్లాడు. దీపకాంతులతో, ఆధ్యాత్మిక శోభతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భక్తులు అంతా దైవాన్ని కొలిచే పనిలో బిజీగా ఉన్నారు. మన దొంగ భక్తుడు కూడా గుడి దగ్గరకు వెళ్లి పద్ధతిగా చెప్పులు బయటపెట్టి లోపలికి వెళ్లాడు. తన ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్ధించాడు. ఇంతవరకూ బాగానే వుంది కానీ ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. ఆలయంలో భక్తులంతా దీపావళి సందడిలో ఉండగా ఇదే సరైన సమయం అనుకున్నాడు. తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. ప్లాన్‌ ప్రకారం గుడిలోని హుండీ ఎత్తుకుని అక్కడినుంచి పరారయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో గౌర్ చౌకీలోని హనుమాన్ దేవాలయానికి వెళ్లిన సదరు దొంగ దేవుడికి ఓ దణ్ణం పెట్టి, హుండీకే ఎగనామం పెట్టాడు. కాగా, గుడిలోని సీసీటీవీలో ఇదంతా రికార్డు అయ్యింది. దీంతో హుండీ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో !! ఎంత ధైర్యం ?? మెడలో పాము ఆపై డ్యాన్స్

ఇదేం స్టంట్‌రా బాబూ.. బాహుబలిని మించిపోయాడు !!

హెయిర్‌కట్‌ చేస్తుండగా అనుకోని ఘటన.. పరుగో పరుగు..

ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు..

మహిళపై పెంపుడు కొండచిలువ ఎటాక్‌.. ఏం చేసిందో చూడండి !!

 

 

Follow us
Latest Articles