Weight loss: కేవలం జంపింగ్ చేస్తూ బాడీ షేప్‌లోకి రావాలా? ఈ 3 ఎక్సర్‌సైజులు ట్రై చేయండి!
బరువు తగ్గాలంటే గంటల తరబడి జిమ్‌లో గడపాలని లేదా ఖరీదైన మిషన్లు ఉండాలని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ, కేవలం మన శరీర బరువుతో చేసే చిన్న చిన్న వ్యాయామాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ నేహా కేవలం మూడే మూడు జంపింగ్ వ్యాయామాల ద్వారా 4 నుంచి 5 కిలోల బరువు ఎలా తగ్గాలో వివరించారు. ఆ సింపుల్ వర్కౌట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వర్కౌట్స్ కష్టంగా ఉన్నాయని వాయిదా వేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే! పరికరాలు లేకుండా, తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలను ఖర్చు చేసే మూడు అద్భుతమైన వ్యాయామాలను నిపుణులు సూచిస్తున్నారు. స్టామినా పెంచుకోవడమే కాకుండా, శరీర ఆకృతిని మెరుగుపరిచే ఈ ఎక్సర్‌సైజుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఫిట్‌నెస్ కోచ్ నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కేవలం మూడు వ్యాయామాలతో 4-5 కిలోల బరువు తగ్గవచ్చని ఆమె నిరూపిస్తున్నారు.
ఆ మూడు వ్యాయామాలు ఇవే:
హాఫ్ జాక్ విత్ బట్ కిక్స్ : సాధారణ జంపింగ్ జాక్స్‌కు ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. నిటారుగా నిలబడి, గాలిలోకి స్వల్పంగా ఎగురుతూ మీ మడమలను వెనుక వైపు (నడుము భాగానికి) తగిలేలా కిక్ చేయాలి. దీనివల్ల కండరాలు దృఢంగా మారుతాయి.
స్టాండింగ్ ఆబ్లిక్ క్రంచెస్ : కాళ్లను భుజాల వెడల్పులో ఉంచి, చేతులను తల వెనుక పెట్టుకోవాలి. ఇప్పుడు కుడి మోకాలిని పైకి ఎత్తుతూ కుడి మోచేతిని దానికి తాకించడానికి ప్రయత్నించాలి. ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయాలి. ఇది పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
సింగిల్ లెగ్ జంప్స్ విత్ అండర్ నీ క్లాప్స్ : ఒక కాలిపై నిలబడి, రెండో కాలి మోకాలిని పైకి ఎత్తాలి. ఇప్పుడు కొంచెం ఎగురుతూ ఎత్తిన మోకాలి కింద చేతులతో చప్పట్లు కొట్టాలి. ఇలా రెండు కాళ్లతో మార్చి మార్చి చేయాలి.
కోచ్ సూచనలు:
ఈ మూడు వ్యాయామాలను ప్రతిరోజూ 30 సార్లు చొప్పున 3 సెట్లు చేయాలని నేహా సూచిస్తున్నారు.
వ్యాయామం ప్రారంభించే ముందు తప్పనిసరిగా ‘వార్మ్ అప్’ చేయాలి మరియు చివరలో ‘స్ట్రెచింగ్’ చేయడం మర్చిపోవద్దు.
ఎటువంటి ఖరీదైన పరికరాలు అవసరం లేకుండా ఇంట్లోనే వీటిని చేయవచ్చు.
గమనిక : పైన పేర్కొన్న వ్యాయామాలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైనా మోకాలి నొప్పులు, వెన్ను సమస్యలు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే, ఈ వ్యాయామాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని లేదా ఫిట్‌నెస్ నిపుణుడిని సంప్రదించండి. గర్భిణీలు తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వీటిని నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి.
