సుప్రీంలో ఎదురుదెబ్బ… చిదంబరంపై ‘లుక్ అవుట్’ నోటీసు జారీ!

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు వ్యవహారంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నేడు చిదంబరం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ కమిటీ ముందుకు వచ్చింది. అయితే దీనిపై తాను ఉత్తర్వులు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. తక్షణ విచారణ కోసం ఈ పిటిషన్‌ను ప్రధాన […]

సుప్రీంలో ఎదురుదెబ్బ... చిదంబరంపై 'లుక్ అవుట్' నోటీసు జారీ!
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2019 | 11:43 AM

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు వ్యవహారంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నేడు చిదంబరం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ కమిటీ ముందుకు వచ్చింది. అయితే దీనిపై తాను ఉత్తర్వులు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. తక్షణ విచారణ కోసం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి ముందుకు పంపిస్తున్నట్లు తెలిపారు. దీంతో చిదంబరానికి అరెస్టు ముప్పు నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడం గమనార్హం.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ఆయన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా ఆయనకు ఉపశమనం లభించలేదు. ఆయన పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత చూపలేదు. బుధవారం ఉదయం దీన్ని దాఖలు చేయాలని సూచించింది. దీంతో చిదంబరం తరపున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, వివేక్‌ టంకా నేడు ప్రత్యేక లీవ్‌ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపేందుకు జస్టిస్‌ రమణ నిరాకరించారు.

మరోవైపు బుధవారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఢిల్లీ హైకోర్టులో తీర్పు వెలువడినప్పటి నుంచి సీబీఐ బృందం ఆయన ఇంటికి రావడం ఇది మూడోసారి. తాజా పరిణామాలతో ఆయన ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.