కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌లు సరిపోవు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రస్తుతం కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) ప్రతినిధి మైక్‌ ర్యాన్‌ పేర్కొన్నారు. వైరస్‌ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు. ప్రస్తుతం కరోనా బాధిత దేశాలు వైరస్‌ సోకిన వాళ్లను కనిపెట్టి వాళ్లను ఐసోలేషన్‌ వార్డుకు తరలించడం దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. కాగా.. లాక్‌డౌన్లు విధించినంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేమని, […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:41 pm, Sun, 22 March 20
కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌లు సరిపోవు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రస్తుతం కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) ప్రతినిధి మైక్‌ ర్యాన్‌ పేర్కొన్నారు. వైరస్‌ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు. ప్రస్తుతం కరోనా బాధిత దేశాలు వైరస్‌ సోకిన వాళ్లను కనిపెట్టి వాళ్లను ఐసోలేషన్‌ వార్డుకు తరలించడం దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.

కాగా.. లాక్‌డౌన్లు విధించినంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేమని, తర్వాత సరైన ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ఈ లాక్‌డౌన్‌లే మరింత ప్రమాదకరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు వైరస్‌ బాధితులను వేగంగా గుర్తించాయని ఆ దేశాలను మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ వైరస్‌కు టీకా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడమే కీలకమన్నారు.