దేశవ్యాప్తంగా మద్యం హోమ్ డెలివరీ.. సర్కార్ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా మద్యం హోమ్ డెలివరీ కాబోతోంది. అత్యున్నత స్థాయిలో గురువారం ఈ నిర్ణయం జరిగింది. దాంతో ఒకటి, రెండు రోజుల్లో ప్రీ ఆర్డర్ బేస్డ్ గా మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు కొన్ని సంస్థలకు ఆదేశాలు ఇవ్వబోతోంది ప్రభుత్వం.

Liquor home delivery across the country: దేశవ్యాప్తంగా మద్యం హోమ్ డెలివరీ కాబోతోంది. అత్యున్నత స్థాయిలో గురువారం ఈ నిర్ణయం జరిగింది. దాంతో ఒకటి, రెండు రోజుల్లో ప్రీ ఆర్డర్ బేస్డ్ గా మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు కొన్ని సంస్థలకు ఆదేశాలు ఇవ్వబోతోంది ప్రభుత్వం. మద్యం అమ్మకాలు లేకపోవడంతో భారీగా ఏర్పడిన ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కరోనా కారణంగా చాలా దేశాల్లో లాక్ డౌన్ పరిస్థితి నెలకొంది. మన దేశం లాగానే పలు దేశాల్లో లిక్కర్ అమ్మకాలకు బ్రేక్ పడింది. మన దేశం లాగానే పలు దేశాల్లో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. సరిగ్గా ఇదే పరిస్థితి దుబాయ్‌లోను నెలకొంది. దాంతో దుబాయ్ ప్రభుత్వం, అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మద్యం సరఫరాను అడ్డుకోవడంతోపాటు లాక్డౌన్ కారణంగా ఏర్పడిన ఆదాయ లోటును పూడ్చుకోవడానికి మద్యాన్ని హోం డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన మారిటైమ్ అండ్ మర్కంటైల్ ఇంటర్నేషనల్(ఎంఎంఐ), ఆఫ్రికన్ ఈస్టర్న్ సంస్థలు జట్టుకట్టాయి. ఈ రెండు సంస్థలు కలిసి ‘లీగల్హోండెలివరీ.కామ్’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించాయి. లాక్ డౌన్ సమయంలో ఇలాంటి సేవలు అవసరమని అంటున్నాయి.
కండీషన్స్ అప్లై
దుబాయ్‌లో ఉన్న పర్యటకులు తమ పాస్‌పోర్టులను ఆధారంగా చూపి మద్యం కొనుగోలు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. స్థానికులకు మద్యం సరఫరా చేయాలంటే మాత్రం పోలీసులు ఇచ్చే ఆల్కహాల్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. 21 ఏళ్లు నిండిన ముస్లిమేతరులు మాత్రమే లైసెన్స్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి దుబాయ్ అంతటా లాక్డౌన్ విధించారు. బార్లు, హోటళ్లు పూర్తిగా మూసేశారు. దీంతో అక్కడి ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. దాంతో మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు సిద్దపడింది దుబాయ్ ప్రభుత్వం.
