LIC HFL Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.80 వేలకు పైగా జీతం..
ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. దేశంలోని పలు రీజియన్లలో ఖాళీగాఉన్న 80 అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
LIC HFL Assistant and Assistant Manager Recruitment 2022: ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. దేశంలోని పలు రీజియన్లలో ఖాళీగాఉన్న 80 అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ పోస్టులు 50 ఉండగా, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 30 వరకు భర్తీ చేయనున్నారు. ఏదైనా స్పెషలైజేషన్‌లో పీజీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇక అభ్యర్ధుల వయసు జనవరి 1, 2022 నాటికి తప్పనిసరిగా 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 25, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.800ల వరకు విధిగా చెల్లించవల్సి ఉంటుంది.
అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 200 ప్రశ్నలకు గానూ 200 మార్కుల చొప్పున 120 నిముషాల పాటు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ పరీక్ష సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభ కనబరచిన వారికి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టులను నిర్వహిస్తారు. ఎంపికైన వారికి అసిస్టెంట్ పోస్టులకైతే నెలకు రూ.33,960లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల రూ.80,110ల చొప్పున జీతంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష విధానం:
- ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 50 మార్కులు
- లాజికల్ రీజనింగ్‌లో 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 50 మార్కులు
- జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 50 మార్కులు
- న్యూమరికల్ ఎబిలిటీలో 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 50 మార్కులు
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.