కేసీఆర్ సారూ ! మా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తాం.. టీఆర్‌ఎస్ టికెట్లివ్వండి

కేసీఆర్ సారూ ! మా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తాం.. టీఆర్‌ఎస్ టికెట్లివ్వండి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. తెలంగాణాలో అధికార టీఆరెస్ పార్టీ ఆ ఎన్నికల్లోనూ గులాబీ జెండాలు ఎగరేయడానికి సిధ్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అక్కడ తన రాజకీయ ‘ అరంగేట్రానికి ‘ పావులు కదుపుతోంది. ఇందుకు కారణం మహారాష్ట్ర.. నాందేడ్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఇతర నేతలు హైదరాబాద్ లో గులాబీదళాధిపతి కేసీఆర్ ను కలిసి తమ వినూత్న కోర్కెను వెలిబుచ్ఛడమే. తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు […]

Anil kumar poka

| Edited By:

Sep 18, 2019 | 2:06 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. తెలంగాణాలో అధికార టీఆరెస్ పార్టీ ఆ ఎన్నికల్లోనూ గులాబీ జెండాలు ఎగరేయడానికి సిధ్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అక్కడ తన రాజకీయ ‘ అరంగేట్రానికి ‘ పావులు కదుపుతోంది. ఇందుకు కారణం మహారాష్ట్ర.. నాందేడ్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఇతర నేతలు హైదరాబాద్ లో గులాబీదళాధిపతి కేసీఆర్ ను కలిసి తమ వినూత్న కోర్కెను వెలిబుచ్ఛడమే. తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని, లేదా తమ గ్రామాలను తెలంగాణాలో విలీనం చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన వీరంతా మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో టీఆరెస్ తరఫున పోటీ చేస్తామని, తమకు పార్టీ టికెట్లు ఇవ్వాలని కోరారు. తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. మీ పార్టీ టికెట్లపై పోటీకి మేం రెడీ అని ప్రకటించారు. నాందేడ్ జిల్లాలోని నల్గావ్, భోకార్, డెగ్లూర్, కిన్వత్, హథగావ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలు వీరంతా.

తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న నాందేడ్ లోని తమ గ్రామాలకు, తెలంగాణకు సంబంధం ఉన్నట్టే తాము అనుభూతి చెందుతున్నామని వీరు చెప్పారు. బాబ్లీ సర్పంచ్ బాబూరావు నేతృత్వంలో వీరు కేసీఆర్ ని కలిశారు. తెలంగాణాలో తమ గ్రామాలను విలీనం చేయాలని గతంలో ధర్మాబాద్ తాలూకాలోని 40 గ్రామాల ప్రజలు ఓ తీర్మానాన్ని ఆమోదించారని, దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 40 కోట్ల గ్రాంట్ ను ప్రకటించిందని, కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఈ నేతలు కేసీఆర్ కు తెలిపారు.మిమ్మల్ని కలిసేందుకు త్వరలో కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీల నాయకులతో కలిసి మళ్ళీ ఇక్కడికి వస్తాం అని వారు కేసీఆర్ కు చెప్పారు. కాగా-నాందేడ్ కు చెందిన వీరే కాక, భివాండీ, షోలాపూర్, రాజర జిల్లాలకు చెందిన వారు కూడా తాము టీఆరెస్ టికెట్లపై పోటీ చేస్తామని తెలిపినట్టు కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణాలో అమలవుతున్న రైతుబంధు వంటి వివిధ సంక్షేమ పథకాల పట్ల వీరు ఆకర్షితులయ్యారని, వీరి డిమాండును మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆశిస్తున్నానని ఆయన అంటున్నారు. ఏమైనా… నాందేడ్ జిల్లా ప్రజల అభ్యర్థనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఓ తిరకాసు ఉంది. మహారాష్ట్రలోనూ గులాబీ జెండాలు ఎగరేయాలని, అక్కడి ఎన్నికల్లో పోటీచేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చుకోవాలని గులాబీ శ్రేణులకు ఉన్నా… మరి.. ఇక్కడి పరిస్థితిని కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. పొరుగు రాష్టం వారికి పార్టీ టికెట్లు ఇఛ్చిన పక్షంలో జరిగే పరిణామాలను అంచనా వేయాల్సి ఉంటుంది. . తమకు తెరాస టికెట్లు ఇవ్వాలని కోరినవారికి వాటిని ఇఛ్చినప్పటికీ వారు ఆ రాష్ట్ర ఎన్నికల్లో గెలిచి తీరుతారన్న గ్యారంటీ లేదు. అప్పుడు కూడా పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవచ్చు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu