కామాక్షి అమ్మావారికి లక్ష కుంకుమార్చన

శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్బంగా కామాక్షి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారికి

కామాక్షి అమ్మావారికి లక్ష కుంకుమార్చన
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 14, 2020 | 3:45 PM

Laksha Kumkumarchana at Kapileshwaram : శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్బంగా కామాక్షి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కరోనా ఆంక్షలకు అనుగూనంగా ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో మహాలక్ష్మీ, సరస్వతి, కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన చేప‌ట్టారు. ముందుగా క‌ల‌శ‌స్థాప‌న‌, గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చనం, క‌ల‌శారాధ‌న చేశారు అర్చకులు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ప్రతీ ఏటా ఈ వేడుకను దేవస్థానం పెద్ద ఎత్తున నిర్వహించేంది. అయితే ఈ ఏడాది కరోనా వ్యాప్తితో అన్ని రకాల అర్జిత సేవలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ భూపతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతిలోనూ కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీవారికి కళ్యాణోత్సవం ఏకాంతంగానే నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇలా భక్తులకు ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.