చైనా బలగాలను తగ్గించుకోవాలని భారత్ వార్నింగ్..

లడఖ్ కేంద్రంగా భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వైపు చర్చలు జరుపుతూనే చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది.

చైనా బలగాలను తగ్గించుకోవాలని భారత్ వార్నింగ్..
Follow us

|

Updated on: Sep 22, 2020 | 4:42 PM

లడఖ్ కేంద్రంగా భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వైపు చర్చలు జరుపుతూనే చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. వక్రబుద్ది మారని డ్రాగన్ కంట్రీ కవ్వింపుచర్యలకు పాల్పడుతూనే ఉంది. చైనా, భారత్‌ మధ్య తాజాగా 12 గంటల పాటు చర్చలు జరిగాయి. భారత్ నుంచి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వంలోని ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన సమావేశంరాత్రి చివరి వరకు కొనసాగింది.

ఉద్రిక్తతలు తలెత్తుతోన్న ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను వెనక్కి పిలిపించుకోవాలని భారత్‌ డిమాండ్‌ చేసినట్లు సమాచారం. చైనా వెనక్కి తగ్గి యథాతథ స్థితిని పునరుద్ధరించకపోతే భారత సైన్యం సుదీర్ఘకాలం పాటు అక్కడే ఉంటుందని భారత అధికారులు చైనాకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే, తూర్పు లడఖ్‌లోని మొత్తం సరిహద్దులో విస్తరణ కోసం రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయాలని భారత్ కోరింది. ముఖ్యంగా పాంగాంగ్‌ సరస్సుతో పాటు హాట్‌స్ప్రింగ్స్‌, డెప్సాంగ్‌, ఫింగర్‌ సమీపంలో చైనా దళాలు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని భారత్‌ డిమాండ్‌ చేసింది.

ఆగస్టు 29-30 తేదీలలో పాంగోంగ్ త్సో-చుషుల్ ప్రాంతంలోని దక్షిణ దిశగా పలు వ్యూహాత్మక ఎత్తులను ఆక్రమించిన తరువాత భారత సైన్యం, సోమవారం ఆరవ రౌండ్ సైనిక చర్చల సందర్భంగా యథాతథ స్థితిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) మే ప్రారంభంలో అనేక ప్రదేశాలలో భారతీయ భూభాగంలోకి చొరబాటుకు యత్నించడంతో భారత దళాలు అడ్డుకోవడంలో భాగంగా సరిహద్దు వెంబడి బలగాలను మోహరించాల్సిన వచ్చిందని భారత్ స్పష్టం చేసింది. ఇక, చైనా ఇదే పరిస్థితి కొనసాగిస్తే, సుదీర్ఘకాలం పాటు ఎలాంటి స్థితినైనా ఎదుర్కొవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిందని సమాచారం.

గతంలో సెప్టెంబర్ 10 న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. చైనా ప్రతినిధి వాంగ్ యి మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఐదు అంశాల దౌత్యపరమైన ఏకాభిప్రాయం కుదిరింది. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసి) వెంట “వాస్తవ గ్రౌండ్ రియాలిటీ” మధ్య భారతదేశం “కొంత డిస్కనెక్ట్” అయ్యింది. తూర్పు లడఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కరించడానికి 5 పాయింట్ల ప్రణాళికపై భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. భారత సైనిక ప్రతినిధి బృందానికి తొలిసారిగా దౌత్య ప్రాతినిధ్యం లభించింది. కానీ, చైనా మాత్రం అవేవి పట్టించుకోకుండా సరిహద్దుల వెంబడి బలగాల మోహరింపును పెంచింది. కాగా, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నవీన్ శ్రీవాస్తవ కూడా చర్చలలో పాల్గొన్నారు. భారత జట్టులో లెఫ్టినెంట్ జనరల్ పి జి కె మీనన్ కూడా ఉన్నారు.

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..