కేజీఎఫ్ రికార్డు బ్రేక్.. కురుక్షేత్రానిదే ఆ క్రెడిట్..

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దుర్యోధనుడుగా నటించిన కురుక్షేత్రం ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. త్రీడీ‌లో తొలిసారిగా రూపొందిన మహాభారత ఇతిహాసాన్ని చూడటానికి కన్నడ అభిమానులే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక కన్నడనాట ఈ సినిమా తొలి రోజు భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే కన్నడలో రికార్డు సెట్ చేసిన స్టార్ హీరో యాష్.. కెజిఫ్ తొలి రోజు కలెక్షన్స్‌ని దర్శన్ కురుక్షేత్రంతో బ్రేక్ చేశాడు. ఈ సినిమాతో తెలుగులో కూడా తన మార్కెట్ […]

కేజీఎఫ్ రికార్డు బ్రేక్.. కురుక్షేత్రానిదే ఆ క్రెడిట్..
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2019 | 5:03 PM

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దుర్యోధనుడుగా నటించిన కురుక్షేత్రం ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. త్రీడీ‌లో తొలిసారిగా రూపొందిన మహాభారత ఇతిహాసాన్ని చూడటానికి కన్నడ అభిమానులే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక కన్నడనాట ఈ సినిమా తొలి రోజు భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే కన్నడలో రికార్డు సెట్ చేసిన స్టార్ హీరో యాష్.. కెజిఫ్ తొలి రోజు కలెక్షన్స్‌ని దర్శన్ కురుక్షేత్రంతో బ్రేక్ చేశాడు. ఈ సినిమాతో తెలుగులో కూడా తన మార్కెట్ ఓపెన్ చేశాడు దర్శన్. అయితే ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్‌లో 25 నిమిషాలు ట్రిమ్ చేశారు. తెలుగు ఆడియన్స్‌కి ఈ విజువల్ వండర్‌ని ఇవ్వడంలో త్రివిక్రమ్ సాయి కీలక పాత్ర పోషించారు. తెలుగు లో కురుక్షేత్రం కలెక్షన్స్ ప్రస్తుతం స్టడీగా ఉన్నాయి. ఈ చిత్రంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌ర్ణుడుగా ద‌ర్శ‌న్ దుర్యోధ‌నుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, అభిమ‌న్యుడిగా అఖిల్‌గౌడ్‌, కృష్ణుడిగా ర‌విచంద్ర‌న్ న‌టించ‌గా ద్రౌప‌దిగా స్నేహ న‌టించారు. ఒకేసారి ఐదు భాషల్లో దీన్ని విడుదల చేశారు. మొట్టమొదటి సారిగా ప్రపంచంలోనే మైతలాజికల్ 3డి వెర్ష‌న్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu