ఇక పై ఛాయ్ వెరీ స్పెషల్.. ఆ టేస్టే వేరు గురూ..!

ఇక పై ఛాయ్ వెరీ స్పెషల్.. ఆ టేస్టే వేరు గురూ..!

మట్టి పాత్రలు తయారు చేసే వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ గ్లాసులో కాకుండా.. మట్టి గ్లాసులో ఛాయ్ పప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌‌కు కేంద్ర రవాణా, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. ఈ మట్టి గ్లాసుల్నే కుల్హర్, కుల్హద్ అని పిలుస్తుంటారు. అయితే దీనివల్ల మట్టి పాత్రలు తయారు చేసే వారికి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 26, 2019 | 9:12 PM

మట్టి పాత్రలు తయారు చేసే వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ గ్లాసులో కాకుండా.. మట్టి గ్లాసులో ఛాయ్ పప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌‌కు కేంద్ర రవాణా, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. ఈ మట్టి గ్లాసుల్నే కుల్హర్, కుల్హద్ అని పిలుస్తుంటారు. అయితే దీనివల్ల మట్టి పాత్రలు తయారు చేసే వారికి మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే పర్యావరణాన్ని రక్షించినట్లు అవుతుందన్నారు. ఇక కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా భారీగా మట్టి గ్లాసులు తయారు చేయాలని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్-KVIC సంస్థను ఆదేశించారు. ఇందులో భాగంగా కుండలు, మట్టిపాత్రలు తయారు చేసేవారికి ఇప్పటికే 10,000 ఎలక్ట్రిక్ వీల్స్‌ని పంపిణీ చేసింది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఈ ఏడాది 25,000 ఎలక్ట్రిక్ వీల్స్‌ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మట్టి గ్లాసులో ఛాయ్, మజ్జిగ సప్లై చేయాలన్న నిర్ణయం ఇప్పటిది కాదు… 2004 లోనే అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. మరి ఇప్పుడైనా పూర్తి స్థాయిలో అమలవుతుందో లేదో చూడాలి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu