హెల్త్ వర్సిటీ, కేయూ, ఓయూ పరిధిలో జరిగే పరీక్షలు వాయిదా
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 19 నుంచి జరగాల్సిన అన్ని ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ర్టార్ డి.ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 19 నుంచి జరగాల్సిన అన్ని ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ర్టార్ డి.ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పోస్ట్‌పోన్ చేసిన పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేదీ త్వరలో చెబుతామన్నారు.
కేయూ, ఓయూ పరిధిలో జరిగే పరీక్షలు వాయిదా :
ఇక వరదలు, వర్షాలు నేపథ్యంలో పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు అక్టోబరు 19, 20వ తేదీల్లో జరగాల్సిన డిగ్రీ ఎగ్జామ్స్ వాయిదా వేసి 20, 21వ తేదీల్లో నిర్వహించనుంది. అలాగే యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన ఎంబీఐ నాలుగో సెమిస్టర్ ఎగ్జామ్స్ సైతం పోస్ట్‌పోన్ చేసింది. అక్టోబరు 19, 20వ తేదీల్లో జరగాల్సిన ఎంబీఏ ఎంబీఏ ఎగ్జామ్స్‌ను 21, 22వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అనౌన్స్ చేసింది. అక్టోబరు 19, 20వ తేదీల్లో నిర్వహించాల్సిన బీఈడీ దూరవిద్య ఎగ్జామ్స్ నవంబరు 2, 3వ తేదీల్లో జరపనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని కాకతీయ విశ్వవిద్యాయం వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టినట్లు తెలిపింది. ఇక అక్టోబరు 19, 20, 21వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనౌన్స్ చేసింది. 22 నుంచి జరగాల్సిన ఎగ్జామ్స్ యథాతథంగా జరుగుతాయని వెల్లడించింది.
Also Read :