కొండెక్కిన కూరగాయల ధరలు

కరోనా కష్టాల్లో ఉన్న సామాన్యులను కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి కూరలో అవసరమయ్యే ఉల్లి ధర కూాడా కన్నీళ్లు పెట్టిస్తోంది.

కొండెక్కిన కూరగాయల ధరలు
Follow us

|

Updated on: Oct 19, 2020 | 5:37 PM

కరోనా కష్టాల్లో ఉన్న సామాన్యులను కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి కూరలో అవసరమయ్యే ఉల్లి ధర కూాడా కన్నీళ్లు పెట్టిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో పంటలు నాశనమయ్యాయి. దీంతో కూరగాయలకు ధరలు పెరిగాయి. వరదలకు రోడ్లు దెబ్బతినడంతో పండిన పంటను  కూడా మార్కెట్లకు తీసుకురావడానికి వీలుకుదరడం లేదు.  కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో టమాటా పంట చాలావరకు పాడైందని రైతులు చెబుతున్నారు. కోస్తాజిల్లాల్లోని  అరటి, కంద, ఉల్లి, దోస, నేల చిక్కుడు, ఆకు కూరకూరల వదరలు కారణంగా పాడైపోయాయి. దీంతో ఏ కూరగాయ టచ్ చేసినా కేజీ ధర రూ.50కి పైనే ఉంది. క్యారెట్‌, చిక్కుడు అయితే ఏకంగా కిలో రూ.100కి చేరాయి. దసరా రావడంతో చాలామంది నాన్ వెజ్ తినరు. ఇదే అదునుగా చేసుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించారు. ఇక ఉల్లి ధర  రోజురోజుకు పెరుగుతూ పోతుంది.  రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.85 అమ్మకాలు సాగిస్తున్నారు. త్వరలోనే రూ.100కు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిక వర్షాలతో ఉల్లి దిగుబడులు పడిపోయాయి. దీంతో ధర పైకి ఎగబాకింది.

Also Read : ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు హెచ్చరిక