రూ. 45 లక్షల ఇస్తేనే వదిలిపెడుతాం.. కిడ్నాపర్ల డిమాండ్
మహబూబాబాద్‌లో 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. క్షణం..క్షణం సినిమా కథను తలపించేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. బాలుడిని కిడ్నాప్ చేసిన ముఠా సభ్యులు ఇంటర్ నెట్ కాల్స్ ద్వారా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. గంటకోసారి బాలుడి తల్లికి...
kidnappers demand : మహబూబాబాద్‌లో 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. క్షణం..క్షణం సినిమా కథను తలపించేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. బాలుడిని కిడ్నాప్ చేసిన ముఠా సభ్యులు ఇంటర్ నెట్ కాల్స్ ద్వారా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. గంటకోసారి బాలుడి తల్లికి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. 45 లక్షల రూపాయలు ఇస్తేనే ప్రాణాలతో వదిలేస్తామని హెచ్చరించారు.
మహబూబాబాద్ కృష్ణకాలనీలో ఉండే న్యూస్ ఛానెల్ కంట్రిబ్యూటర్ రంజిత్ రెడ్డి కొడుకు దీక్షిత్ కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్ పై వచ్చాడు. మొఖానికి మాస్క్ ధరించి వచ్చిన ఆ వ్యక్తి దీక్షిత్ ను పిలిచి బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే దీక్షిత్ తల్లి వసంతకు ఫోన్ చేసి నీ కొడుకును కిడ్నాప్ చేశామని 45లక్షలు ఇస్తేనే వదిలేస్తామని బెదిరించారు. తెలిసినవారే కిడ్నాప్ చేసి ఉండవచ్చని బాలుడి తల్లి వసంత చెబుతోంది.
బాలుడి కిడ్నాప్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మహబూబాబాద్ ఎస్పీ ఎనిమిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు. చివరిసారిగా సాయంత్రం 4 నుండి ఆరు గంటల మధ్య ఫోన్ చేస్తానన్న కిడ్నాపర్ నుండి ఎలాంటి కాల్ రాకపోవడతో ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా బాలుడిని కాపాడి తీరుతామని మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్ చెప్పారు.