AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్త చేతులతో రావద్దు : ఎంపీలకు కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎంపీలకు సూపర్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఢిల్లీ వెళ్ళండి.. ఉత్త చేతులతో ఊపుకుంటూ రావద్దు’’ ఇది కేటీఆర్.. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఇచ్చిన వార్నింగ్. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీలతో కేటీఆర్ మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా, ప్రస్తావించాల్సిన అంశాలపైనా సుదీర్ఘంగా చర్చించారు. మునిసిపల్ ఎన్నికల్లో కనీవినీ […]

ఉత్త చేతులతో రావద్దు : ఎంపీలకు కేటీఆర్ వార్నింగ్
Rajesh Sharma
|

Updated on: Jan 28, 2020 | 7:04 PM

Share

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎంపీలకు సూపర్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఢిల్లీ వెళ్ళండి.. ఉత్త చేతులతో ఊపుకుంటూ రావద్దు’’ ఇది కేటీఆర్.. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఇచ్చిన వార్నింగ్. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీలతో కేటీఆర్ మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా, ప్రస్తావించాల్సిన అంశాలపైనా సుదీర్ఘంగా చర్చించారు.

మునిసిపల్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయం సాధించేలా పార్టీని నడిపించిన కేటీఆర్‌ను ఎంపీలంతా కలిసి అభినందించారు. ఆ తర్వాత పార్లమెంటు సమావేశాల వ్యూహంపైన చర్చించారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు, నీతి ఆయోగ్ నిధులు.. అన్నింటినీ సాధించేలా కార్యాచరణ అమలు పరచాలని కేటీఆర్ ఎంపీలను ఆదేశించారు.

విభజన హామీలను నెరవేర్చకుండా గత ఆరేళ్లుగా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. వాటి అమలు కోసం కచ్చితంగా పోరాడాలన్న కేటీఆర్ సూచన మేరకు పని చేస్తామని సమావేశం అనంతరం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు వెల్లడించారు. ఏన్ఆర్సీ, సీఏఏలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటన చేసినందున దానికి అనుగుణంగా పార్లమెంటులో వ్యవహరిస్తామని కేకే అన్నారు.

జాతీయ జనాభా గణనలో ఓబీసీ కేటగిరీని చేర్చాలని కోరతామన్నారు. ఎకానమీ తగ్గుదల, సీఏఏ లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తామని కేకే చెప్పారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని, ఈ అంశంపై మోదీ సర్కార్‌ని నిలదీస్తామని ఆయనన్నారు. బుధవారం ఢిల్లీలో జరగనున్న అఖిల పక్ష సమావేశంలో కూడా ఈ అంశాలను చేర్చాలని కోరుతామన్నారు. గత బడ్జెట్‌లో ప్రస్తావించి, నెరవేర్చని అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు లోక్‌సభలో టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర రావు.

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ